Varuntej-Lavanya tripathi: మెగా ఇంట సందడి నెలకొంది. దంపతులు హీరో వరుణ్‌తేజ్, లావాణ్య త్రిపాఠిలు తల్లిదండ్రులైయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో లావణ్యా త్రిపాఠి మగ శిశువుకు జన్మనిచ్చారు. ఈ వార్త బయటకు రాగానే, సోషల్‌మీడియాలో వరుణ్‌తేజ్(Varuntej), లావణ్య త్రిపాఠి(Lavanya tripathi)లకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ఇక ఈ విషయం తెలియగానే, మన శంకర వరప్రసాద్ సినిమా సెట్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు వెళ్లి, వరుణ్–లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి.

2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమా కోసం తొలిసారి కలిసి నటించారు వరుణ్, లావణ్య. ఈ సమ యంలోనే వరుణ్–లావణ్యల మధ్య స్నేహాం మొదలైంది. ఆ తర్వాతి ఏడాదే ‘అంతరిక్షం’ సిని మా కోసం మళ్లీ కలిసి నటించారీద్దరు. ఈ సమయంలో వీరి స్నేహాం ప్రేమగా మారింది. ఈ తర్వాత ఈ ఇద్దరు ఇరు కుటుంబాల సభ్యులను ఒప్పించి, 2023 నవంబరు 1న ఇటలీలో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది మేలో జీవితంలోనే అత్యంత అద్భుతమైన పాత్రను పోషించనున్నాని, కమింగ్‌సూన్ అని వరుణ్‌తేజ్ పేర్కొన్నారు. ఇలా తాను తండ్రి కాబోతున్న విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు వరుణ్.
ఇక సినిమాల విషయానికి వస్తే…ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ అనే ఓ హారర్ ఫిల్మ్ చేస్తు న్నాడు వరుణ్‌తేజ్. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకుడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరోవైపు ‘సతీలీలావతి’ అనే సినిమా చేస్తున్నారు లావణ్య త్రిపాఠి. ఈ చిత్రంలో దేవ్ మోహన్ మరో కీలక పాత్రధారి. తాతినేని సత్య ఈ సిని మాకు దర్శకుడు.
కార్తికేయ దర్శకుడు చందూమొండేటి యానిమేషన్ సినిమా వాయుపుత్ర