Venkatesh New Film: ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘మనశంకరవరప్రసాద్‌గారు’ సినిమాతో సక్సెస్ అందుకున్న దర్శకుడు అనిల్‌రావిపూడి నెక్ట్స్ మూవీపై ఇం డస్ట్రీలో పలు రకాల చర్చలు వినిపించాయి. తాజాగా తన నెక్ట్స్ మూవీపై అనిల్‌రావిపూడియే క్లారిటీ ఇచ్చారు.
‘ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాల్లో వెంకటేశ్ హీరోగా నటించగా, అనిల్‌రావిపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చిరంజీవి హీరోగా నటించిన ‘మనశంకరవరప్రసాద్‌గారు’ సినిమాలోనూ వెంకటేశ్ ఓ గెస్ట్ రోల్ చేశారు. అయితే అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రానున్న కొత్త సినిమాలో వెంకటేశ్ హీరోగా నటించనున్నారు. ఇది ఇద్దరు హీరోల కథ. దీంతో వెంకటేశ్‌తో పాటుగా, ఈ సినిమాలో నందమూరి కల్యాణ్‌రామ్ మరో లీడ్ రోల్‌లో నటించనున్నారు. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అలాగే వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా తెలిపారు. ఇక దర్శకుడిగా తనకు తొలి చాన్స్ ఇచ్చిన కళ్యాణ్‌రామ్‌తో అనిల్‌రావిపూడి దాదాపు పదేళ్ల తర్వాత మరో సినిమా చేస్తున్నారు. ఇక వెంకటేశ్ కెరీర్‌లో మల్టీస్టారర్ సినిమాలు చాలానే ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నారాయన.
VijayDevarakonda and Rashmika Wedding: విరోష్ వెడ్డింగ్ ఫోటోలు
కానీ ఆసక్తికరంగా ఈ సినిమాను ఎవరు నిర్మించనున్నారన్న విషయంపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. వెంకటేశ్‌కు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఉంది. కల్యాణ్‌రామ్‌కు నిర్మాణసంస్థ ఉంది. దీంతో ఈ రెండు సంస్థలే ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటాయా? లేక సాహు గారపాటి కూడ ఈ చిత్రంతో అసోసియేట్ అవుతారా? అన్న విషయాలపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ‘దిల్’ రాజుతో అనిల్‌రావిపూడి ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ సోలో నిర్మాతగా దిల్ రాజు మూవీ చేయాలనుకుంటున్నారు. సో..ఈ మూవీలో నిర్మాణంలో ఆయన భాగస్వామ్యం అయ్యే అవకాశం లేకపోవచ్చు. ఏదీ ఏమైనా నిర్మాణసంస్థల వివరాలు లేకుండ సినిమా అనౌన్స్‌మెంట్ రావడం అనేది మాత్రం కాస్త ఆసక్తికరమైన అంశమనే చెప్పవచ్చు.