Venkatesh: ఆల్‌టైమ్‌ సంక్రాంతి రికార్డు సాధ్యమేనా?

Venkatesh: వెంకటేష్‌ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా, తెలుగు సినిమా చరిత్రలో ఆల్‌ టైమ్‌ సంక్రాంతి కలెక్షన్స్‌ రికార్డు గల మూవీగా నిలుస్తుందా?

Viswa
2 Min Read

‘ఎఫ్‌2, ఎఫ్‌ 3’ చిత్రాల తర్వాత హీరో వెంకటేష్ (Venkatesh), దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వీరిద్దరికీ హ్యాట్రిక్‌ విజయాన్ని అందించింది. కలెక్షన్స్‌ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. రిజినల్‌ స్థాయిలో కొన్ని భారీ సినిమాల రికార్డులను తిరగరాసిందీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా.

రూ. 200 కోట్ల రూపాయాల గ్రాస్‌ కలెక్షన్స్‌

ఈ మూవీ ఇప్పటికే దాదాపు రూ. 200 కోట్ల రూపాయాల గ్రాస్‌ కలెక్షన్స్‌కు చేరువైంది. రూ. 100 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇలా రూ. 100 కోట్లు షేర్‌ సాధించి, అతికొద్దిమంది హీరోల జాబితాలో వెంకటేష్‌ కూడా నిలిచారు. లాంగ్‌ రన్‌లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు రూ. 300 కోట్ల రూపాయాల గ్రాస్‌ కలెక్షన్స్‌ వస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే సంక్రాంతి ఫెస్టివల్‌ సమయంలో వెంకటేష్‌ సినిమాల విజయశాతం ఎక్కువగా ఉంది. సంక్రాంతి ఫెస్టివల్‌కి బాలకృష్ణ సినిమాలు ఎక్కువగా రిలీజ్‌ కాగా, విజయాల శాతం మాత్రం వెంకటేష్‌ (Venkatesh) సినిమాలకు ఉండటం విశేషం.

Paatal Lok Webseries Seanson2: పాతాళలోకం 2 రివ్యూ

రూ. 100 కోట్ల షేర్‌

అయితే తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతికి విడుదలై, అత్యధిక కలెక్షన్స్‌ను సాధించిన రికార్డు ‘హను మాన్‌’ పేరిటి ఉంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2024 సంక్రాంతి సందర్భంగా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై, దాదాపు రూ. 350 కోట్ల రూపాయాల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించింది.

RifleClub Telugu Review: మలయాళం ఫిల్మ్‌ రైఫిల్‌ క్లబ్‌ రివ్యూ

హనుమాన్‌ రికార్డును బ్రేక్‌ చేస్తుందా?

మరి..ఈ రికార్డును ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బీట్‌ చేయగలదా? లేదా?అనేది చూడాలి. ఒకవేళ ఈ రికార్డును కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అధిగ మించగలిగితే.. ..అప్పుడు నిజంగా వెంకటేష్‌ ‘సంక్రాంతి కింగ్‌’ అనొచ్చు. ‘హను–మాన్‌’ రిజీనల్‌ కలెక్షన్స్‌ను ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ బీట్‌ చేయగలదు. మరి..టోటల్‌ కలెక్షన్స్‌ను  బీట్‌ చేస్తుందా? లేదా అనేది చూడాలి.

Share This Article
3 Comments