కథ
VickyKaushal Chhaava Review: ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తర్వాత మరాఠి రాజ్యాన్ని ఆక్రమించుకోవడం సులభమైపోయిందని మొఘలుల రాజు ఔరంగజేబు (అక్షయ్‌ఖన్నా) భావిస్తాడు. ప్రత్యేక వ్యూహాలు రచిస్తాడు. కానీ ఔరంగజేబు ఆటలు సాగ నీవ్వడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ (విక్కీకౌశల్).అంతటితో ఆగకుండఢిల్లీసుల్తానులు, ఔరంగజేబులు ఆర్థికంగా బలహీనపడేలా, శంభాజీ పథకం వేస్తాడు. దాడులుకు సిద్ధం అవుతాడు. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబు, శంభాజీని ఎలాగైనా నిలువరించాలని యుద్ధం ప్రకటిస్తాడు. తానే స్వయంగా రంగంలోకి దిగుతాడు. మరి..ఎంతో శక్తివంతమైన మొఘలుల సైన్యాన్నిశంభాజీ ఎలా ఎదుర్కొన్నాడు? శంభాజీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? శంభాజీ శత్రుసైన్యానికి చిక్కి నప్పుడు, శంభాజీ భార్య ఏసుభాయి (రష్మికా మందన్నా) పరిస్థితి ఏమిటి? అన్నది సినిమాలో చూడాలి (VickyKaushal Chhaava Review)
విశ్లేషణ
చారిత్రాత్మక సినిమాలను తీయడం అనేది పెద్ద సవాల్‌తో కూడుకున్న పని. పైగా ఓ బుక్ ఆధారంగా అంటే మరింత కష్టం. ఛావా సినిమాను అలానే తీశారు. శివాజీ సావంత్ మరాఠి రాసిన నవల‘ఛావా’ ఆధారంగా‘ఛావా’ సినిమాను తీశారు ఈ చిత్రం దర్శకుడు లక్మణ్‌ఉటేకర్. ఛత్రపతి మరణం తర్వాత మరాఠ సామ్రాజ్యంలో రాజ్యంలో జరిగే అధికారిక మార్పిడి కోసం జరిగే రాజకీయాలు, ఎత్తులు, కుయుక్తులు, కుట్రలు వంటి వాటితో తొలిభాగం సాగుతుంది. మరోవైపు ఔరంగజేబు వ్యూహాల సన్నివేశాలూ ఉంటాయి.ఇలా మేజర్‌గా పొలిటికల్ డ్రామాతో తొలిభాగం ముగుస్తుంది.
కానీ సెకండాఫ్ తీరు వేరాల ఉంటుంది. యుద్ద సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్‌లు వంటి వాటితో సినిమా సాగుతుంది. మెఘలుల సైన్యాలను ఎదుర్కొనేందు మరాఠ సేనలు చేసే గొరిల్లా దాడులు ఆడియన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి. కానీ శంభాజీకి వెన్నుపొటు పొడిచే సీన్స్ సినిమాను మరింత ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తాయి. ఆ తర్వాత ఢిల్లీ సేనల మెరుపుదాడితో మరాఠ యోధులు చనిపోతుండే ఆడియన్స్ ఒకింత ఎమోషన్‌కు లోనవుతాడు. మరి..ముఖ్యంగా శంభాజీ శత్రుసైన్యాలకు దొరకడం, వారు శంభాజీని చిత్ర హింసలు పెట్టే సీన్స్ అయితే ఆడియన్స్ మనసులను తాకుతాయి. కన్నీళ్లు పెట్టుకుంటారు. చివరి అరగంట సీన్స్ సినిమా (Chhaava Review)లో హైలెట్ ఉంటాయి.
చారిత్రాత్మక సినిమాలతో వచ్చే చిక్కు ఏంటంటే…వాస్తవిక ప్రమాణాలను పాటించడం. సినిమా అంటే కల్పితం. ‘ఛావా’ సినిమాలోనూ కొంత సినిమాటిక్ లిబర్టీ కనిపిస్తుంటుంది. మార్కెట్ పరంగా ఆలోచించి,సినిమాకు కొంత కమర్షియల్ టచ్ ఇచ్చారన్న ఆలోచన రావొచ్చు. సినిమాలో మరాఠ ఛత్రపతి శంభాజీవీరత్వం, విరోచిత పోరాటం, శత్రువుల ముందు తలవొంచని ధైర్యం…ఇలాంటి సీన్సే మేజర్ హైలైట్ ఉంటాయి. ఇవి ఒకే. కానీ ఇతర ప్రదాన పాత్రలకూ కూడా కథలో మంచి ప్రాముఖ్యత లభించి ఉంటే సినిమా మరింత బాగుండేది.
పెర్ఫార్మెన్స్
ఛత్రపతిశంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ నటనను మెచ్చుకోవాల్సిందే. యుద్ధ సన్నివేశాలు, పతాక సన్నివేశాల్లో విక్కీ కౌశల్ నటుడిగా తన పూర్తి సామార్థ్యాన్ని చూపించినట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో ఈ సినిమాలో తన భార్యగా చేసిన ఏసుభాయితో కలిసి ఉన్న సీన్స్‌లో విక్కీ సెటిల్డ్ యాక్టింగ్ కూడా బాగుంటుంది. ఇక శంభాజీ మహారాజ్ భార్య ఏసుభాయిగా రష్మికా మందన్నా తన పాత్రను బాగా చేశారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఔరంగజేబుగా అక్షయ్‌ఖన్నా కూడా మెప్పించాడు. కథలో ఇంకొంచెం బలం ఈ పాత్రకు చేకూర్చాల్సింది. హంబిరావుగా అశుతోష్ రాణా, జీనత్ బేగంగా డయానా పెన్టీ, కవి కలాష్‌గా వీనిత్‌కుమార్, సోయరాభాయిగా దివ్య దత్తాలు వారి వారి పాత్రల మేరకు యాక్ట్ చేశారు.
దర్శకుడు లక్ష్మణ్‌ఉటేకర్ టేకింగ్ బాగుంది. వార్ డ్రామాలో కూడా విక్కీ, రష్మికల మధ్య ఉన్న సీన్స్‌నూ చక్కగా ఇమిడింప జేశారు. మరాఠ రాజు స్థాయికి తగ్గట్లుగా తీశాడు. ఇందుకు బాగానే ఖర్చు పెట్టారు నిర్మాత దినేష్ విజన్. మంచిగా ఖర్చుపెట్టబట్టే వార్ సీక్వెన్స్‌లు స్క్రిన్‌పై బాగా కనిపి స్తున్నాయి. ఇందుకు సౌరభ్ గోస్వామి కెమెరా పనితనం, ప్రతిభ తోడ్పడ్డాయి. ఇక ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ఏఆర్ రెహమాన్ సంగీతం. ‘జానే తు, ఆయారే తుఫాన్’ వంటి సాంగ్స్ బాగున్నాయి. ఇక యాక్షన్ సీక్వెన్స్‌లలో వచ్చే రెహమాన్ ఆర్‌ఆర్ సినిమాకు ప్రాణం పోసిందనే చెప్పాలి.
బాటమ్‌లైన్: విక్కీకౌశల్ నట విశ్వరూపం ‘ఛావా’
రేటింగ్: 2.75