‘కింగ్‌డమ్’ (Vijaydevarakonda kingdom) సినిమా రిలీజ్‌పై ఉన్న సందిగ్ధతకు ఓ తెర పడింది. ‘కింగ్‌డమ్’ (kingdomTheMovie) సినిమాను ముందుగా అనుకున్నట్లుగానే, మే 30న రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ధ్రువీకరించారు. మే 9న విజయ్ దేవరకొండ బర్త్ డే. ఈ సందర్భంగా ‘కింగ్‌డమ్’ మూవీ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి, ఈ పోస్టర్‌పై మే30 (Vijaydevarakonda kingdom movie Release)అని రిలీజ్‌డేట్‌ని కన్ఫార్మ్ చేశారు. ఇలా కింగ్‌డమ్ రిలీజ్‌కు అన్నీ ప్రాబ్లమ్స్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది.
పవన్ అడ్డంకి లేదు!
విజయ్‌దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమాను తొలుత మార్చి 28న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అదే తేదీకి పవన్‌కళ్యాణ్ హరిహరవీరమల్లు మూవీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. దీంతో ‘కింగ్‌డమ్’ రిలీజ్ వాయిదా పడింది. ఆ తర్వాత మే 30న కింగ్‌డమ్ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మళ్లీ పవన్‌కళ్యాణ్ ‘హరిహరవీరమల్లు’ మూవీ మే 30న రిలీజ్ కాబోతుందని, దీంతో ‘కింగ్‌డమ్’ సినిమా రిలీజ్ వాయిదా తప్పదన్న వార్తలు వినిపించాయి. కానీ హరిహరవీరమల్లు మూవీ రిలీజ్ మే 30న ఉండటం లేదు. దీంతో..ముందుగా అనుకున్నట్లే…‘కింగ్‌డమ్’ మూవీ మే 30న రిలీజ్ అవుతోంది.
కింగ్‌డమ్ గురించి..!
విజయ్‌దేవరకొండ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. ఈ మూవీ విజయ్ దేవరకొండ పోలీసాఫీర్‌గా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ స్పై యాక్షన్ డ్రామా అని కూడా వినిపిస్తోంది. అలాగే ‘కింగ్‌డమ్’ సినిమా పునర్జన్మల నేపథ్యంతో ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల విడదలైన ‘కింగ్‌డమ్’ సినిమా ట్రైలర్‌లో రెండు డిఫరెంట్ టైమ్‌లైన్ ఉన్నట్లుగా విజువల్స్ కనిపిస్తున్నాయి. సో..కింగ్‌డమ్ మూవీలో రెండు టైమ్ పీరియడ్స్ ఉండటం కన్ఫార్మ్ అన్నట్లుగా తెలుస్తోంది. కింగ్‌డమ్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే (kingdom Movie heroine)హీరోయిన్ కాగా, అనిరు«ద్ సంగీతం అందిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి (kingdom Movie Director)ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
రెండు పార్టులుగా కింగ్‌డమ్!
కింగ్‌డమ్ మూవీ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నెల 30న విడుదలైయ్యే కింగ్‌డమ్ మూవీ తొలిభాగం బాక్సాఫీస్ సక్సెస్‌పై కింగ్‌డమ్ మూవీ రెండో భాగం ఆధారపడి ఉంటుంది. ‘కింగ్‌డమ్’ మూవీ రెండు పార్టులుగా విడుదల అవు తుందని, ఈ చిత్రం నిర్మాత నాగవంశీ ఓ సందర్భంగా చెప్పుకొచ్చారు.