ప్రముఖ తమిళ హీరో దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ (Vijay JanaNayagan Release). ‘బీస్ట్’ మూవీ తర్వాత తమిళ హీరో విజయ్, పూజాహెగ్డేలు ఈ మూవీ కోసం కలిసి జంటగా యాక్ట్ చేస్తున్నారు. హెచ్. వినోద్ ఈ సినిమాకు డైరెక్టర్. కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.
కాగా ఈ సినిమా విజయ్ కెరీర్‌లో లాస్ట్ మూవీ. ఈ చిత్రం తర్వాత విజయ్ రాజకీయాల్లో (Thalapathy vijay Political) బిజీ అవుతారు. ఆల్రెడీ రాజకీయాల్లో ఉత్సాహంగా పాల్గొంటు న్నారు విజయ్. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో విజయ్ పోటీ చేయాలని అనుకుంటున్నారట.
సంక్రాంతికి జననాయగన్
ఇక విజయ్ కెరీర్‌లోని చివరి చిత్రం, 69వ చిత్రం అయిన ‘జన నాయగన్’ సినిమాను జనవరి 9న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అంటే…సంక్రాంతి సందర్భంగా ఈ ‘జననాయగన్’ మూవీని రిలీజ్ చేస్తున్నారు. అయితే శివకార్తీకేయన్ హీరోగా చేస్తున్న ‘పరాశక్తి’ మూవీ కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. అయితే పరాశక్తి రిలీజ్‌పై పూర్తిస్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
భగవంత్ కేసరి రీమేక్..!
బాలకృష్ణ హీరోగా అనిల్‌రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ‘భగవంత్‌సింగ్ కేసరి’ సినిమా తెలుగులో విజయం సాధించింది. ఈ మూవీని తమిళ రీమేక్ హక్కులను కేవీఎన్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. దీంతో భగవంత్‌సింగ్ కేసరి తమిళ రీమేక్‌గా ‘జననాయగన్’ మూవీ రూపుదిద్దుకుంటుందనే టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది.
‘జననాయగన్’ మూవీని డైరెక్ట్ చేసే తొలి చాన్స్ అనిల్‌రావిపూడికే వచ్చింది. ఈ సినిమా విషయమై విజయ్–అనిల్‌కు మధ్య చర్చలు కూడా జరిగాయి. కానీ..వెంకటేష్‌తో ఆల్రెడీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కమిటైన అనిల్‌రావిపూడి, విజయ్‌కు సున్నితంగా నో చెప్పారని తెలిసింది.
కొన్నేళ్లుగా విజయ్ సినిమాలు సంక్రాంతి లేదా దీపావళి సందర్భాల్లోనే థియేటర్స్‌కు వస్తున్నాయి. దీంతో జననాయగన్ మూవీ కూడా 2025 దీపావళి సందర్భంగా థియేటర్స్‌లోకి వస్తుందని అందరూ ఊహించారు. కానీ 2026 సంక్రాంతి సందర్భంగా ‘జననాయగన్’ సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు విజయ్.