తమిళ స్టార్ హీరో విజయ్ చివరి తమిళ చిత్రం ‘జన నాయగన్’. విజయ్ చివరి చిత్రం అయిన ‘జన నాయగన్’ (Jananayagan) కు హెచ్. వినోద్ (Jananayakudu Director) డైరెక్టర్. కన్నడ నిర్మాత వెంకట్ కె నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై ఈ సినిమా ను నిర్మిస్తున్నాడు. తెలుగులో ‘జననాయకుడు’ అనే టైటిల్ ఖరారు అయ్యింది. నేడు విజయ్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘జననాయగన్’ సినిమా నుంచి, చిన్న టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో విజయ్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నట్లుగా, లేటెస్ట్‌గా విడుదలైన ‘జననాయగన్’ సినిమా టీజర్ స్పష్టం చేస్తోంది. ఇంకా ఈ టీజర్‌లో విజయ్ స్టైలిష్‌గా రావడం కనిపిస్తుంది. ‘కలిసి ఎదుగుదాం, లీడర్ అనే వాడు పవర్ కోసం కాదు..ప్రజల కోసం’ అంటూ రెండో క్యాప్షన్స్ కనిపించాయి. ఇక ‘జన నాయగన్’ సినిమాను సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడం భాషల్లో జనవరి 9న రిలీజ్ చేస్తున్నారు.
పవర్ కోసం కాదు..ప్రజల కోసం..జన నాయకుడు

Leave a Comment