బిచ్చగాడు కాంబినేషన్‌తో విజయ్‌ ఆంటోని వంద దేవుళ్ళు సినిమా

Viswa

Web Stories

Nooru Saami: హీరో విజయ్‌ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘బిచ్చగాడు’. 20 16లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘బిచ్చగాడు’ సినిమాకు సీక్వెల్‌గా ‘బిచ్చగాడు 2’ వచ్చింది. కానీ ఈ సినిమాకు శశి దర్శకత్వం వహించలేదు. విజయ్‌ ఆంటోనీయే హీరోగా నటించిన, స్వీయ దర్శకత్వంలో నిర్మిం చాడు. 2023లో రిలీజైన ఈ సినిమా ఫర్వాలేదనిపించింది.

ఇక పదేళ్ల తర్వాత అంటే..2016లో వచ్చిన బిచ్చగాడు తర్వాత విజయ్‌ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబినేషన్‌లో ‘నూరు సామి’ (Nooru Saami) సినిమా రానుంది. ఈ చిత్రానికి తెలుగులో ‘వంద దేవుళ్లు’ (VandhaDhevullu)  అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నామని, ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రామంజనేయులు తెలిపారు. అంతేకాదు..వచ్చే మే 1న ఈ సినిమాను రిలీజ్‌ చేయబోతున్నట్లుగా కూడా ఆయన వెల్లడిం చారు. ఇక ‘బిచ్చగాడు 3’ (Bichhagadu 3) కూడా ఉంటుందని, కాకపోతే పాముల నేపథ్యంతో ఓ పెద్ద గ్రాఫిక్‌ సినిమాను విజయ్‌ ఆంటోనీ చేయబోతున్నారని, ఆ సినిమాకు ముందే ‘బిచ్చగాడు 3’ (Pichaikkaran 3) స్టార్ట్‌ చేస్తారా? లేక ఈ సినిమా తర్వాత ‘బిచ్చగాడు 3’ ఉంటుందా? అనే విషయంపై ఓ స్పష్టత రావాల్సి ఉందని రామాంజనేయులు చెప్పారు.

విజయ్‌ ఆంటోనీ (VijayAntony) హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘భద్రకాళి’ (. ఈ సినిమా ఈ సెప్టెంబరు 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, ‘బిచ్చగాడు 3’, ‘వందే దేవుళ్లు’ వంటి సినిమాలను గురించి, ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన రామంజనేయులు చెప్పారు. ఇక ‘భద్రకాళి’ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రం అవుతుందని, ఇందులో విజయ్‌ ఆంటోనీ ఓ పొలిటికల్‌ బ్రోకర్‌ పాత్రలో నటించారు. రాజకీయం ప్రధానంశంగా సాగే, ఈ ‘భద్రకాళి’ తరహా సినిమా ఇప్పటివరకు రాలేదని, ఈ చిత్రం దర్శకుడు అరుణ్‌ ప్రభు ఈ సిని మాలో మంచి సందేశాన్ని కూడా మేళవింపు చేశారని రామంజనేయులు చెప్పుకొచ్చారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos