‘ఎవడే సుబ్రహ్మాణ్యం’ సినిమాలో నానితో స్క్రీన్ షేర్ చేశారు విజయ్‌దేవరకొండ. అప్పటీకి విజయ్ దేవర కొండ హీరోగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఆ తర్వాత మరో హీరో ఉన్న సినిమాలో విజయ్ దేవరకొండ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే ఇప్పుడు సూర్యతో విజయ్‌దేవరకొండ స్క్రీన్ షేర్ చేసుకుంటారనే టాక్ తెరపైకి వచ్చింది.
సూర్యతో వెంకీ అట్లూరి ఓ మూవీ (Suriya46) చేస్తున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీ ఉంటుంది. మారుతి ఇంజిన్ తొలిసారి ఇండియాకు ఎలా తీసుకురాబడింది? అనేది ఈ సినిమా మెయిన్ ప్లాట్ అని ప్రచారం జరుగుతోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తాడు. మేలో షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఈ మూవీలో సూర్యతో పాటుగా, ఓ యంగ్ హీరోకు చాన్స్ ఉంది. తొలుత ధనుష్‌ను అప్రోచ్ అయ్యారు వెంకీఅట్లూరి. వెంకీ దర్శకత్వంలో సితార బ్యానర్‌లోనే ధనుష్ ‘సార్’ మూవీ చేశాడు. ఇది సూపర్‌హిట్. సో…సూర్య సినిమాలోని అవకాశాన్ని ధనుష్ ఒప్పుకుంటారనే అనుకున్నారు వెంకీ అట్లూరి. కానీ. ..సున్నితంగా ధనుష్ నో చెప్పారట.
దీంతో ఈ పాత్రకు ఇప్పుడు విజయ్‌దేవరకొండ(Vijaydevarakondainsurya46)ను ప్రిపర్ చేస్తాడున్నారట వెంకీ అట్లూరి. విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అయి నప్పుడు… సోషల్ మీడియా వేదికగా సూర్య సపోర్ట్ చేశాడు. ఇప్పుడు విజయ్ లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’కు సూర్య తమిళ డబ్బింగ్ చెప్పారు. ఇటు ‘లైగర్’ వంటి ఫ్లాప్ తర్వాత నాగవంశీ ….విజయ్‌దేవరకొండకు ‘కింగ్‌డమ్’లాంటి బిగ్ బడ్జెట్ ఫిల్మ్ చేసి పెట్టాడు. మరి…ఇలా అటు సూర్య నుంచి…ఇటు నాగవంశీ నుంచి విజయ్‌దేవరకొండకు లబ్ది ఉంది.
ఇంకా సూర్యతో విజయ్‌దేవరకొండ స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుంటుందన్నట్లుగా వెంకీ అట్లూరి..రెట్రో ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పాడు. సో…మరి..ధనుష్ ప్లేస్‌ను విజయ్‌దేవరకొండ రీ ప్లేస్ చేస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ.