విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా ఓటీటీ (Kingdom OTT) స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. ‘కింగ్‌డమ్’ (kingdom) సినిమా ఈ ఆగస్టు 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటుగా, ఇతర భాషల్లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో, సత్యదేవ్ మరో లీడ్ రోల్ చేశాడు. శివ (సత్య దేవ్), సూరి (విజయ్‌దేవరకొండ) అనే ఇద్దరు అన్నదమ్ములు, సముద్రంపై స్మగ్లింగ్, అంతరిం చిపోతున్న ఓ తెగ…వంటి అంశాల నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ కింగ్‌డమ్ సినిమా థియేటర్స్‌లో విడుదలైనప్పుడు, మిక్డ్స్ రెస్పాన్స్ లభించింది. మరి..ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
విజయ్ దేవరకొండ కింగ్డమ్ రివ్యూ
ఇక ప్రజెంట్ విజయ్‌దేవరకొండ 19వ శతాబ్దం నేపథ్యంతో సాగే సినిమాతో బిజీగా ఉన్నాడు. రాయలసీమ నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగు తుంది. రాహుల్ సంక్రత్యాన్ ఈ సినిమాకు దర్శకుడు. అలాగే రవికిరణ్ కోలా డైరెక్షన్‌లో ఓ సినిమాకు కమిటైయ్యాడు విజయ్ దేవ రకొండ. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే యాక్షన్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రాలే కాకుండ దర్శకుడు హరీష్‌శంకర్‌తో విజయ్‌దేవరకొండ ఓ సినిమా చేస్తారనే ప్రచా రం సాగుతోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.