పాన్ ఇండియా తరహా సినిమాలు ఏవైనా ఒకే టైటిల్‌తో రిలీజైతే, ఎంతో కొంత బూస్ట్ ఉంటుంది. ఇటీవలి కాలంలో విడుదలైన, పాన్ ఇండియా సినిమాలు అన్నీ ఇలానే విడుదల అయ్యాయి. ఆల్మోస్ట్ సేమ్ టైటిల్‌తో భారతదేశ వ్యాప్తంగా విడుదల అయ్యాయి. దీంతో చాలామంది కూడా ఇంగ్లీష్ టైటిల్స్‌నే ప్రిఫర్ చేశారు. ఇలా రజనీకాంత్ సినిమాకు ‘కూలీ (Coolie)’ టైటిల్ ఖరారైంది. కానీ ట్విస్ట్ ఏంటంటే… ఈ ‘కూలీ’ టైటిల్ హిందీలో వేరే వాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. దీంతో ఈ చిత్రం దర్శకుడు లోకేష్ కనగరాజ్ ‘కూలీ’ సినిమా హిందీ రిలీజ్ కోసం మరో టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు. కానీ ఆ టైటిల్‌తో విడుదల అయితే ‘కూలీ’, ఆ సినిమా వేరు వేరు అనుకుంటారని భావించి, హిందీలో కూడా ‘కూలీ’ అని అర్థం వచ్చేలా ‘కూలీ’ సినిమాకు ‘కూలీ ది పవర్‌హౌస్’ (CoolieThepowerhouse)అనే టైటిల్ పెట్టాడు. ఇలా కొంతవరకు కూలీ టైటిల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యినట్లే..
కానీ విజయదేవరకొండ విషయంలో మాత్రం ఇది సాధ్యం కాలేదు. విజయ్‌దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. ఈ టైటిల్‌తోనే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుంది. కానీ హిందీలో మాత్రం ‘సామ్రజ్య’ (kingdom Hindi title Saamrajya) టైటిల్‌తో విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ నెల 31న ‘కింగ్‌డమ్’ సినిమా రిలీజ్ కానుంది.
ఇది కచ్చితంగా విజయ్‌కు మైనస్ పాయింట్‌నే. పైగా హిందీలో సామ్రాజ్య సినిమా విడుదల నాటికి, హరిహరవీరమల్లు, హిందీ చిత్రం సయరా, అజయ్‌దేవగన్ సన్నాఫ్ సర్దార్ 2, థడక్ 2, వంటి చిత్రాలు ఉన్నాయి. ఇలా థియేర్స్ పరంగానూ విజయ్‌కు ఇది సరైన రిలీజ్ కానే కాదు. ఇక గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో సత్యదేవ్ ఓకీలక పాత్రలో యాక్ట్ చేయగా, భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్‌గా చేశారు. సితార ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. కింగ్‌డమ్ సినిమా ఓటీటీ రిలీజ్ రేట్స్ రూ.50 కోట్లు వచ్చా యనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.