వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు ఉన్నాయి. మరి…కింగ్డమ్ సినిమా విజయం సాధించిందా? విజయ్ ఫ్యాన్స్ హ్యాఫీ ఫీలవుతారా? అనేది రివ్యూలో చదవండి
సినిమా : కింగ్డమ్ (Kingdom Movie Review)
ప్రధాన తారాగణం విజయ్‌దేవరకొండ, సత్యదేవ్, భాగ్య శ్రీ బోర్సే, అయ్యప్ప పి. శర్మ, వీపీ వెంకటేష్,
నిర్మాతలు : శ్రీకర స్టూడియోస్, నాగవంశీ, సాయి సౌజన్య
మ్యూజిక్ అనిరుధ్ రవిచందర్
కెమెరా: గిరీష్ గంగాధరన్, జోమోన్ టి. జాన్
ఎడిటింగ్ : నవీన్‌నూలి
నిడివి: 2 గంటల 40 నిమిషాలు
విడుదల తేది: 2025-07-31 (kingdom Movie Release date)
రేటింగ్ 2.5/5
Kingdom Movie Review: శివ (విజయ్ దేవరకొండ), సూరి (సత్యదేవ్) అన్నదమ్ములు. ఓ బలమైన కారణం చేత చిన్నప్పుడే వీరిద్దరూ విడిపోతారు. సూరి పోలీస్ కానిస్టేబుల్ అవుతాడు. చిన్నప్పుడే తమకు దూరమైన అన్నను తిరిగి ఇంటికి తీసుకురావాలని సూరి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇంతలో సూరికి, అతని పై అధికారులు ఓ అండర్ కవర్, కోవర్ట్ ఆపరేషన్ ‘వైట్ సాండ్’ లో భాగం చేస్తారు.ఈ ఆపరేషన్ లో పార్ట్ అయితే, తన అన్న శివను, తిరిగి తెచ్చుకోవచ్చని సూరి కి చెబుతారు. దింతో ఈ ఆపరేషన్ లో పార్ట్ గా శ్రీలంక వెళ్తాడు సూరి. అక్కడ తన అన్న శివ.. ఓ స్మగ్లింగ్ కార్టైల్ సిండికేట్ కింద పని చేసే ఓ వర్గానికి నాయకుడు అని సూరికి తెలుస్తుంది. జైలులో అన్న ను కలుసు కుంటాడు సూరి. శివ కి కూడా సూరి తన తమ్ముడని తెలుస్తుంది. కానీ తననే నమ్ముకున్న దివి ప్రజలను వదిలి శివ తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితి. మరో వైపు దివి ప్రజలపై పెత్తనం చేస్తుంటాడు మురుగన్ (వెంక టేష్ వీపీ) . మరి… తన అన్నను సూరి ఒప్పించి, ఇంటికి తీసుకెళ్లగలిగాడా? శివ కోసం వచ్చిన సూరి.. ఓ పోలీస్ ఇన్ఫర్మార్ అని స్మగిలింగ్ సిండికేట్ కార్టైల్ కి, దివి ప్రజానీకానికి తెలిసిందా? ఆపరేషన్ వైట్ సాండ్ కి, డాక్టర్ మధు (భాగ్య శ్రీ) ఉన్న సంబంధం ఏమిటీ? అనేది మిగిలిన సినిమా (Kingdom Movie Review).
Kingdom విశ్లేషణ
1920 ఎపిసోడ్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. దివి ప్రజలు.. ఇటు ఇండియా లో కానీ, అటు శ్రీలంక లో కానీ ఎందుకు పౌరసత్వం లేదు? అని చెప్పడమే ఈ ఎపిసోడ్. ఇది పూర్తి కాగానే… 70 సంవత్సరాల తర్వాత… అంటూ… 1991 లోకింగ్డమ్ సినిమా స్టార్ట్ అవుతుంది (kingdomreview).
పాత్రల పరిచయం, సూరి అన్నను కలుసుకొని, దివి ప్రజలకు అండగా నిలబడటం తో ఫస్టాఫ్ ముగుస్తుంది. గోల్డ్ స్మగ్లింగ్ కార్టైల్ కి సూరి ఎదురితిరిగి, మురుగన్ పని పట్టడం తో కింగ్డమ్ సినిమా సెకండాఫ్ ముగుస్తుంది. సెకండ్ పార్ట్ (kingdom2) కి కొన్ని ఆసక్తికరమైన లీడ్స్ ఇచ్చారు.

పుష్ప, ఛత్రపతి, కేజీఎఫ్… తరహా లో ఈ కింగ్డమ్ సినిమా కథ కూడా చాలా పెద్దది. సిండికేట్ కార్టైల్ ను కట్టడి చేసేందుకు స్పై లను నియమించడం, ఈ స్పై లకు ఓవర్ షాడో స్పై లు.. ఉండడం అనే కాన్సెప్ట్ సూపర్ గా ఉంది. విజయ్, సత్య దేవ్ ల ఎమోషన్స్ కూడ వర్కౌట్ అయ్యాయి. కానీ.. ఏదో వెలితి. అదే… కథ లో కొత్తదనం కొరత స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి తోడు… ఆడియన్స్ ఊహించ గలిగే సన్నివేశాలు తెరపై కనిపించడం మరో మైనస్. క్లైమాక్స్ కూడా రొటీన్ గా ఉంటుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ ఛత్రపతి ఇంట్రవెల్ ను గుర్తు చేస్తుంది. దివి ప్రజల బ్యాక్ డ్రాప్ సూర్య రెట్రో ను గుర్తు చేస్తుంది. కానీ ఫస్టాఫ్ లో జైలు సీక్వెన్స్, సెకండ్ హాఫ్ లో బోట్ సీన్, ఫస్ట్ హాఫ్ లో హీరో గోల్డ్ రికవరీ సీన్ బాగున్నాయి. కొంత సినిమెటిక్ లీబర్టీ తీసుకున్నారు. విజయ్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. మాస్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది.
Kingdom లోఎవరు ఎలా చేశారు?
సూరి గా విజయ్ దేవరకొండ బాగా యాక్ట్ చేశాడు. ముఖ్యంగా జైల్ సీక్వెన్స్, ఫారెస్ట్ ఫైట్, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ లో తన ఈజ్, స్వాగ్ చూపించాడు. ఎమోషనల్ సీన్స్ లో మెప్పించాడు. కానీ కొత్త తరహా నటన అయితే లేదు. శివ గా సత్యదేవ్ యాక్టింగ్ ఓకే. ఒకటి రెండు సీన్స్ లో తన వెర్స్ టైల్ యాక్టింగ్ చూపించాడు. కానీ ఈ రోల్ చాలా రొటీన్ గా ఎండ్ అవుతుంది. రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాకుండా ఓ కొత్త తరహా పాత్రలో కనిపించారు భాగ్యశ్రీ. కానీ ఆమె పాత్ర కు, కథ లో బలం లేదు. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా తక్కువే. చాలా సినిమా ల్లో కామెడీ చేసిన కసిరెడ్డి కి, ఈ సినిమా లో మంచి సీరియస్ రోల్ దొరికింది. ఉన్నంత లో చేశాడు. ఇక మురుగన్‌గా వీపీ వెంకటేష్ విలన్ పాత్రలో సూపర్‌గా నటించాడు. స్క్రీన్ పర్‌ఫెక్ట్ యంగ్ విలన్‌గా కనిపించాడు. సెకండాఫ్‌లో ఈ పాత్రతో వచ్చే ఓ విలనీజం సీన్‌లో వెంకటేష్ మంచి నటన కనబరచాడు. బైరాగి గా అయ్యప్ప శర్మ, ఉన్నతధికారిగా మనీష్ శర్మ, పోలీస్ లుగా గోపరాజు రమణ, మురళి ధర్ గౌడ్.. ఇలా మిగిలిన వారు, వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

డైరెక్టర్ గా గౌతమ్ తిన్నానురి మంచి కథ రాసుకున్నాడు. పెద్ద కథే రాసాడు. ఎమోషన్స్ ని బాగానే బ్లెండ్ చేశాడు. కానీ హీరో క్యారెక్టర్ ను కొత్త గా ప్రెజెంట్ చేయలేక పోయాడు… మరి.. ముఖ్యం గా సెకండ్ హాఫ్ లో సినిమా చాలా స్లో అవుతుంది డ్రామా పరంగా. కథ లో పెద్ద మలుపులు ఉండవు. కానీ అ నవసరమైన లవ్ ట్రాక్, సాంగ్స్, మితిమీరిన హీరోఇజం సీన్స్ లేకుండా గౌతమ్ జాగ్రత్త తీసుకొని మంచి పనే చేశాడు. అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమా కు బలం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాంగ్స్ మ్యూజిక్ ఓకే. నిర్మాణ విలువలు, కెమెరా పనితనం సూపర్ గా ఉన్నాయి. నవీన్ నూలి ఇంకాస్త ఎడిట్ చేయవచ్చు. సెకండ్ హాఫ్ లో ఆ స్కోప్ ఉంది.
ఫైనల్‌గా…విజయ్‌దేవరకొండ మాస్ ‘కింగ్డమ్’