విజయ్‌దేవరకొండ ‘కింగ్‌డమ్’ (VijayDevarakonda kingdom) సినిమా విడుదల తేదీ జూలై 31 (VijayDevarakonda kingdom Release date) అని ఖరారైపోయింది. విజయ్ దేవరకొండ తొలిసారిగా పోలీసాఫీసర్‌గా చేశాడు. అయితే విజువల్స్‌లో విజయ్ ఎక్కువ గా జైలులో ఖైదీగా ఉన్నట్లుగా చూపించారు. అంటే…కథ రిత్యా ఓ అండర్‌కవర్ ఆపరేషన్‌ను విజయ్ టేకప్ చేస్తున్నాడనిపిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ సినిమాలో సత్యదేవ్ (Satyadev) ఓ మరో ప్రధాన పాత్రలో నటించాడు. మోస్ట్‌లీ విలన్ అని తెలుస్తోంది. కింగ్‌డమ్ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ‘కింగ్‌డమ్’ నుంచి ఇప్పటి వర కు వచ్చిన కంటెంట్ అయితే బాగానే ఉంది. కానీ..కింగ్‌డమ్ సినిమా రిలీజ్ డేట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
విజయ్‌దేవరకొండ గత చిత్రం ‘ఫ్యామిలీమేన్’ ఫ్లాప్ మూవీ. ఈ సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాలకు విజయ్‌దేవరకొండ నుంచి రాబో తున్న సినిమా ‘కింగ్‌డమ్’. ఈ సినిమా విజయం కెరీర్ పరంగా విజయ్‌కు చాలా కీలకం. ఈ తరుణంలో పవన్‌కల్యాణ్ హీరోగా చేసిన ‘హరిహర వీరమల్లు’ సినిమా జూలై 24న విడుదల అవుతుందటే…జస్ట్ వారం తర్వాత…విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమా విడుదల అవుతోంది.
ముందు ఎలా ఉన్నా….పవన్‌కల్యాణ్ ‘హరిహరవీరమల్లు’ (Pawankalyan HariHaraveeramallu) సినిమా ట్రైలర్ విడుదల అయిన తర్వాత మాత్రం, ఈ సినిమాపై అంచనాలు పెరిగి పోయాయి. ఇటు ఇండస్ట్రీ, అటు.. ఆడి యన్స్‌లో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. పైగా పవన్‌కల్యాణ్ నుంచి రెండు సంవత్సరాల తర్వాత, అదీ పవన్ ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఉన్న ఈ టైమ్‌లో పవన్ నుంచి సినిమా వస్తుండటం అనేది , ఆయన ఫ్యాన్స్‌కు మంచి ఊపునిచ్చే సినిమా. ‘హరిహరవీరమల్లు’ సినిమాకు ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా, ఆ సునామిలో ‘కింగ్‌డమ్’ ఆటు పోట్లు తప్పవు.
ఓటీటీ ప్రెజెర్స్ వల్ల ‘కింగ్‌డమ్’ విడుదల తేదీ జూలై 31కి వచ్చి ఉండొచ్చు. కానీ బేరసారాలతో ఏలాగైనా ‘కింగ్‌డమ్’ కాస్త వెనక్కి తగ్గి ఉండాల్సింది. ఎందుకంటే యాక్టర్‌గా…పవన్‌కల్యాణ్ ఈ రోజు కొత్తగా నిరూపించుకునేది ఏమీ లేదు. కానీ విజయ్ మాత్రం తన సినిమా బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించుకోవాల్సిన సమయం ఇది. ‘కింగ్‌డమ్’ రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా…విజయ్ తర్వాతి సినిమాలు రావడానికి కనీసం ఏడాది పడుతుంది. ఈ సయమం విజయ్ కెరీర్‌కు మరింత ఇబ్బంది అవుతుంది. మరి..’కింగ్‌డమ్’ భవితవ్యం ఏముతుందో చూసే సమయం దగ్గర్లోనే ఉంది.