విజయ్ దేవరకొండ (VijayDevarakonda) ‘కింగ్‌డమ్’ సినిమా నెక్ట్స్ వీక్ థియేటర్స్‌లోకిర రానుంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంతో ఈ సినిమా కథ ( kingdom Story) సాగుతుంది. ఈ చిత్రంలో అన్నయ్య పాత్ర శివగా సత్యదేవ్ (SatyaDev), తమ్ముడు సూరిగా విజయ్‌దేవరకొండ కనిపిస్తారు. గోపరాజురమణ…వీరి తండ్రి పాత్రలో పోలీస్ కానిస్టేబుల్‌గా కనిపిస్తారని ‘అన్నా అంటేనే..’ పాట లిరికల్ వీడియోలో పరోక్షంగా కనిపించింది. అయితే ఈ ‘కింగ్‌డమ్’ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ కానిస్టేబుల్‌గా కనిపించారు. అంటే..తండ్రి పాత్ర చనిపోతే, కారుణ్య నియామకం ప్రకారం విజయ్‌దేవరకొండకు కానిస్టేబుల్ పోస్ట్ వచ్చిందా? అనే డౌట్ రావొచ్చు. ఇక విజయదేవరకొండ ‘కింగ్‌డమ్’ సంబంధించిన పలు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా మరో కథ తెరపైకి వచ్చింది.

‘కింగ్‌డమ్’ సినిమాలో తన అన్నయ్య శివ శ్రీకాకుళం వెళ్లి తప్పిపోతాడట. అన్నయ్య ఆచూకి కోసం శ్రీకాకుళం వెళ్లినప్పుడు సూరికి కొన్ని ఆశ్చర్యకరమైన విశేషాలు తెలుస్తాయట. దీంతో ఆన్నయ్య కోసం తమ్ముడు సూరి శ్రీలంకకు వెళ్తాడట. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది? పోలీస్ స్టేబుల్ అయిన సూరిని ప్రేక్షకులు ఎందుకు అరెస్ట్ చేశారు? అన్నదే ‘కింగ్‌డమ్’ సినిమా మెయిన్ స్టోరీ కాన్‌ఫ్లిక్ట్ అనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే ‘కింగ్‌డమ్’ నుంచి వచ్చిన, టీజర్, ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించాయి. రేపు తిరుపతిలో జరగబోయే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తో…ట్రైలర్ కూడా రాబోతుంది. ఇలా… ఈ ‘కింగ్‌డమ్’ సినిమా ట్రైలర్ కూడా విడుదలైతే, ఈ సినిమా కథపై మరింత క్లారిటీ వస్తుంది. ‘కింగ్‌డమ్’ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.ఈ కింగ్‌డమ్ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకుడు.
అలాగే ఇటీవల విడుదలైన కింగ్‌డమ్ టీజర్‌లో కొందరు బాణాలతో యుద్దం చేయడం చూశాం. సో…ఈ సినిమా కథ మరో టైమ్‌లైన్‌లో కూడా సాగుతుందనే టాక్ వినిపించింది. కానీ అసలు..కథ వేరే ఉందట. ఈ కింగ్‌డమ్ మూవీలో పునర్జన్మల కాన్సెప్ట్ ఉందట. మగధీర సినిమాలో మాదిరి. దీంతో…ఇలా ‘కింగ్‌డమ్’ స్టోరీని గురించిన వివరాలు సినిమాపై మరితంఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాను నాగవంశీ, సౌజన్య నిర్మిస్తుండగా, అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్.
పవన్‌కల్యాణ్ హరిహరవీరమల్లు సినిమా రివ్యూ