విజయ్‌దేవరకొండ హీరోగా ‘రాజా వారు రాణిగారు’ సినిమా ఫేమ్ రవికిరణ్ కోలా డైరెక్షన్‌లో రాబోతున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమాలో కీర్తీ సురేశ్ హీరోయిన్‌గా నటిస్తారు. రెగ్యులర్ షూటింగ్‌ను ఈ నెల 16 నుంచి ప్రారంభిస్తున్నారు. తొలి షూటింగ్ షెడ్యూల్‌లోనే ఈ సినిమాలోని ప్రధాన తారాగాణం పాల్గొంటారని తెలిసింది.
రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ చిత్రం రానుంది. విలేజ్ పాలిటిక్స్, ఓ కుర్రాడి అగ్రెసివ్‌నెస్, లవ్‌స్టోరీ, ఫాదర్ ఎమోషన్..వంటి అంశాల మేళవింపుతో, ఈ సినిమా ఆడి యన్స్‌ను ఆకట్టుకోనుందని తెలిసింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లోని 15వ సినిమా ఇది. ఇక ఈ సినిమాకు ‘రౌడీ జనార్థన’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా, గతంలో ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన ‘దిల్’ రాజు ప్రక టించిన సంగతి తెలిసిందే.
ఇక ఈసినిమాయే కాకుండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో విజయ్‌దేవరకొండ ఓ పీరి యాడికల్ యాక్షన్ సినిమా చేయనున్నారు. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించనున్నారు. రాయలసీమ నేపథ్యంతో, స్వాంతంత్య్రానికి పూర్వం జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా, ఈ సినిమా రానుంది. ఇందులో విజయ్ దేవరకొండ ద్విపాత్రా భినయం చేస్తారనే ప్రచారం సాగుతోంది.