విజయ్‌దేవరకొండ (VijayDevaraonda VD12) హీరోగా గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లోని మూవీ మార్చి 28న రిలీజ్ కావాల్సింది. కానీ ఈ సినిమా మే 30కి వాయిదా పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తు న్నారు. కథ రిత్యా ఈ మూవీలో విజయ్ దేవరకొండ (VijayDevaraonda VD12) పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. అండర్ కవర్ కాప్ అన్నమాట. అంటే..‘పోకిరి’ సినిమాలో మహేశ్‌బాబు చేసిన మాదిరి. రెండు పార్టులుగా ఈ చిత్రం విడుదల కానుంది. అయితే మే 30న విడుదల అయ్యే తొలిపార్టు సక్సెస్ అయితేనే, రెండోపార్టుపై క్లారిటీ ఉంటుంది.
తొలిసారి పోలీసాఫీసర్‌గా నాని
మరోవైపు రవితేజ ‘మాస్ జాతర’, నాని ‘హిట్ 3’ చిత్రాలు కూడా మే నెలలోనే రిలీజ్‌కు రెడీ అవు తున్నా యి. ‘హిట్’ ఫ్రాంచైజీగా ఉన్న ‘హిట్’ సిరీస్ నుంచి ‘హిట్ 3’ వస్తుంది. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నాని హీరోగా చేస్తున్నారు. ఇందులో అర్జున్ సర్కార్ అనే ఓ పోలీసాఫీసర్ పాత్రలో నాని నటిస్తు న్నారు. నానికి పోలీస్‌గా ఇది తొలిసినిమా. కానీ ‘హిట్’ సిరీస్‌పై మాత్రం ఆడియన్స్‌లో అంచనాలు ఉన్నా యి.
రవితేజ మాస్ జాతర
ఇక పోలీస్ చిత్రాలంటే రవితేజ (Raviteja) లో కొత్త ఎనర్జీ క్రియేట్ అవుతుంది. పోలీస్ డ్రామా జానర్‌లో ‘విక్ర మార్కు డు, పవర్, క్రాక్’ వంటి హిట్స్ ఉన్నాయి రవితేజకి. అలాంటిది రవితేజ మళ్లీ ‘మాస్ జాతర’ కోసం ఖాకీ డ్రస్ వేశారు. ‘సామజవరగమన’ మూవీకి రైటర్‌గా చేసిన భాను బోగవరపుతో ‘మాస్ జాతర’ చేస్తున్నారు రవి తేజ. ఈ ‘మాస్ జాతర’ చిత్రం మే 9న రిలీజ్ అవుతుంది.
ఇలా మే1 ‘హిట్ 3’, మే9న ‘మాస్ జాతర’, మే 30న విజయ్‌దేరకొండ కాప్ డ్రామా. మరి..