విజయ్ దేవరకొండ (VijayDevarakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి (GowthamTinnanuri) దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలి సిందే.ఈ సినిమాకు కింగ్‌డమ్ (VijayDevarakonda Kingdom) అనే టైటిల్‌ను ఖారరు చేసి, మే 30న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. బుధవారం టైటిల్, టీజర్‌ను రిలీజ్ చేశారు.
అలసట లేని భీకరయుద్ధం…వలసపోయిన, అలసిపోయిన ఆగిపోనిది ఈ మహారణం..నేలపైన దండయాత్రలు…
ఇంత భీభత్సం… ఈ వినాశనం ఎవరికోసం…రణభూమిని చీల్చుకుని పుట్టేకొత్త రాజు కోసం…. అన్న డైలాగ్స్ ఉన్నాయి.
సూర్యదేవరనాగవంశీ (Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తమిళ టీజర్‌కు హీరో సూర్య, హిందీ టీజర్‌కు బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌కపూర్, తెలుగు టీజర్‌కు ఎన్టీఆర్‌లు వాయిస్ ఓవర్‌లు అందించారు. అనిరుద్‌రవిచందర్ (Anirudh Ravichander) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

తనతో ట్యాక్సివాలా మూవీ తీసిన రాహుల్‌సంకృత్యాన్‌తో మరో మూవీ చేస్తున్నాడు విజయ్‌దేవరకొండ. బ్రిటిషర్ల పరిపాలనకాలం నేపథ్యంతో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఆల్రేడీ సెట్ వర్క్ మొదలైంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీ కరణ ప్రారంభం కానుంది. మైత్రీమూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. విజయ్‌దేవరకొండ కెరీర్‌లోని 14వ సినిమా ఇది.
‘రాజావారు రాణిగారు’ మూవీ తీసిన రవికిరణ్ కోలా డైరెక్షన్‌లో విజయ్‌దేవరకొండ హీరోగా మరో మూవీ మొదలుకానుంది. ‘దిల్’ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం లొకేషన్ల హంటింగ్ జరుగుతోంది. అతిత్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. విజయ్‌దేవరకొండ కెరీర్‌లోని 15వ సినిమా ఇది.
విజయ్‌దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్‌లో కూడా ఓ సినిమా రావాల్సింది. మూడేళ్ళ క్రితమే ఈ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు.