ముచ్చటగా మూడోసారి…

Viswa
vijaydevarakonda and Rashmikamandhanna team up third time

VD14: హీరో విజయ్‌దేవరకొండ (Vijaydevarakonda), హీరోయిన్‌ రష్మికా మందన్నా (Rashmikamandhanna) లు కలిసి ముచ్చటగా మూడోసారి యాక్ట్‌ చేయనున్నారు. తొలిసారి ‘గీతగోవిందం’ సినిమా కోసం విజయ్, రష్మికలు కలిసి యాక్ట్‌ చేశారు. ఆ తర్వాత ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలో హీరో హీరోయిన్లుగా చేశారు. ఇప్పుడు విజ య్‌కి ‘టాక్సీవాలా’తో హిట్‌ ఇచ్చిన దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ చేయబోయే సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తున్నారు.

విజయ్‌దేవరకొండ హీరోగా చేస్తున్న ఈ హిస్టారికల్‌ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. రాయ లసీమ నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుంది. 19వ శతాబ్ధం నేపథ్యంతో 1854 – 1878 మధ్య కాలంలో జరిగే కథ ఇది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ‘డియర్‌ కామ్రేడ్, ఖుషి’ చిత్రాల తర్వాత విజయ్‌దేవరకొండతో మైత్రీమూవీమేకర్స్‌ నిర్మిస్తున్న సినిమా ఇది. వీలైనంత తొందరగా ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని విజయ్‌ దేవరకొండ భావిస్తున్నారట. ఇంకా ఈ సినిమాతో పాటుగా, ‘రాజావారు రాణిగారు’ సినిమా తీసిన రవికిరణ్‌ కోలా డైరెక్షన్‌లో ఓ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా సినిమా చేయనున్నారు విజయ్‌ దేవరకొండ. ఈ సినిమా షూటింగ్‌ కూడా అతి త్వరలోనే ప్రారంభం కానుంది

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *