విక్రమ్ (Vikram) సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. కరెక్ట్‌గా రిలీజ్ చేస్తే విక్రమ్ సినిమాలు తెలుగు డిస్ట్రి బ్యూటర్స్‌కు లాభాలు తెచ్చి పెడ తాయి. అయితే విక్రమ్ తన లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూరన్: పార్టు 2’ చిత్రం తెలుగు రిలీజ్ విషయంలో రిస్క్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎస్‌యూ అరుణ్‌కుమార్ డైరెక్షన్ లోని ఈ వీరధూరశూరన్ (Vikram Veera Dheera Sooran) మూవీ తెలుగులో ‘వీర ధీర శూర’గా రిలీజ్ అవుతోంది. తెలుగు, తమిళం రెండు భాషల్లో ఈ సినిమాను మార్చి 27న రిలీజ్ చేస్తున్నారు.
కానీ ఇదే సమయానికి అంటే…తెలుగులో మార్చి 28న రాబిన్‌హుడ్, మ్యాడ్ 2 సినిమాలు రిలీజ్ అవుతు న్నాయి. మరో మలయాళ చిత్రం ‘ఎంపురాన్ 2’ (లూఫీసర్ 2) చిత్రం కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది.ఇలాంటి తరుణంలో విక్రమ్ తన మూవీని మార్చి 27న తెలుగులో రిలీజ్ చేయడం కచ్చితంగా రిస్క్ అనే చెప్పవచ్చు. పైగా ఇప్పటివరకు ‘రాబిన్‌హుడ్, మ్యాడ్ 2’ సినిమాల నుంచి వచ్చిన కంటెంట్ ఆడియన్స్ అటెన్షన్‌ను గ్రాబ్ చేసింది. లూసీఫర్ మూవీపై ఎలాగూ అంచనాలు ఉన్నాయి. మరి..విక్రమ్ మూవీకి తెలుగులో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.