Vikram Veera Dheera Sooran Review: వీర ధీర శూరన్‌ రివ్యూ

Vikram Veera Dheera Sooran Review: విక్రమ్‌ హీరోగా యాక్ట్‌ చేసిన రా అండ్‌ రిస్టిక్‌ ఫిల్మ్‌ 'వీర ధీర శూరన్‌' మూవీ రివ్యూ. ఎస్‌యూ అరుణకుమార్‌ డైరెక్టర్‌. ఎస్‌జే సూర్య ఓ లీడ్‌ రోల్‌ చేశారు.

Viswa
3 Min Read
vikram-Veera-Dheera-Sooran-part-2 Review

Vikram Veera Dheera Sooran Review: చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని, భార్య వాణీతో హ్యాపీ లైఫ్‌ లీడ్‌ చేస్తుంటాడు కాళి. సడన్‌గా..ఓ రోజు కాళి పాత యజమాని రవి వస్తాడు. తనను, తన కొడుకు కన్నా (సూరజ్‌ వెంజాముడు)ను ఎస్పీ అరుణగిరి ఎన్‌కౌంటర్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాడని, ఎలాగైనా తమను కాపాడాలని కాళిని వేడుకుంటాడు. కాళికి ఉన్న గతం కారణంగా రవిని రక్షించేందుకు ఒప్పుకుంటాడు కాళి. తండ్రీకొడుకులు రవి, కన్నాలను ఎస్సీ అరుణగిరి ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేయాలనుకుంటాడు? అరుణగిరికి, కాళికి ఉన్న సంబంధం ఏమిటి? అసలు…కాళి గతం ఏమిటి? రవి చెప్పిన పనిని చేసేందుకు కాళి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందనేది సినిమాలో చూడాలి (Vikram Veera Dheera Sooran Review)

వీర ధీర శూర సినిమా ప్రమోషన్స్‌లో విక్రమ్, ఈ చిత్రం దర్శకుడు ఎస్‌యూ అరుణ్‌కుమార్‌ గట్టిగా ఓ మాట చెప్పారు. సినిమా ప్రారంభ సన్నివేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్‌ అవ్వద్దని. వారు ఇలా ఎందుకు చెప్పారో సినిమా మొదలైన ఐదు సినిమాలప్పుడు తెలుస్తుంది. ఒకవేళ ఆడియన్‌ ఈ ఐదు నిమిషాలను మిస్‌ అయినట్లయితే…ఈ సినిమా చూసే విషయంలో కచ్చితంగా అసంతృప్తికి లోనవ్వక తప్పదు.

‘వీర ధీర శూర’ సినిమాలోని రెండో పార్టును ‘వీర ధీర శూర: పార్టు 2’గా ముందు రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇలా సినిమా ప్రారంభం సన్నివేశాలకు ఇంపార్టెన్స్‌ ఉండాల్సి వచ్చింది. రవి–కన్నా, అరుణగిరి సన్నివేశాలతోనే ఈ సినిమా ప్రారంభం అవుతుంది. హీరో విక్రమ్‌ దాదాపు ఇరవైనిమిషాల తర్వాత కానీ స్క్రీన్‌పైకనిపిస్తారు. కానీ అప్పటి వరకు ఆడియన్‌కు బోర్‌ కొట్టకనివ్వకుండ జాగ్రత్త పడటంతో దర్శకుడు సఫల మైయ్యాడు. ఇంట్రవెల్‌ బ్యాంగ్‌ సింపుల్‌గా ఉన్నా, కొత్తగా అనిపిస్తుంది. కాళి ప్లాష్‌బ్యాక్‌ సీన్స్‌ ఇంకాస్త బాగుండి ఉండాల్సింది. ఇంకా ప్లాష్‌బ్యాక్‌ తాలుకా ఎన్నో ప్రశ్నలు ఆడియన్స్‌ను వెంటాడుతుంటాయి. ముఖ్యంగా దిలీప్‌ అనే పాత్ర. బహుశా…ఈ పాత్ర చిత్రీకరణ మొదటిపార్టులో ఉంటుందెమో చూడాలి.

కథ మేజర్‌గా ఒక రాత్రి సమయంలో జరుగుతుంది. గతంలో కార్తీ ‘ఖైది’, ఇటీవల కిచ్చా సుదీప్‌ ‘మ్యాక్స్‌’ చిత్రాల మాదిరి అన్నమాట. కానీ స్క్రీన్‌ ప్లేని, ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లను బాగా తీయించాడు అరుణ కుమార్‌. కాళి–సూరజ్, కాళి–అరుణగారిల మధ్య వచ్చే సీన్స్‌ సూపర్భ్‌గా ఉంటాయి. ప్రతి పాత్రలోనూ ఒకింత నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న భావన కలుగుతుంది. సినిమాలోని ఇంటెన్స్‌ యాక్షన్, డ్రామా, రస్టిక్‌ సీన్స్‌ను
తెరపై పండిచడంలో అరుణ్‌ సక్సెస్‌ అయ్యారు. మందుపాతర సీన్స్, పోలీస్‌ స్టేషన్‌లో విక్రమ్‌ సీన్‌ వంటివి .రెండు చక్కని ఉదాహరణలు. క్లైమాక్స్‌ కూడా ఆడియన్స్‌ను మెప్పించే విధంగా కొత్తగా ఉంటుంది.

డిఫరెంట్‌ రోల్స్‌ చేయడంలో విక్రమ్‌ సత్తా ఏంటో ఈ సినిమాలోని యాక్టింగ్‌తో మరోసారి ప్రూవ్‌ అవు తుంది. ఈ రా అండ్‌ రస్టిక్‌ మూవీలో విక్రమ్‌ యాక్టింగ్‌ను ఇరగదీశాడు. యాక్షన్‌ సన్నివేశాల్లో అదర గొట్టాడు. ఎస్పీ అరుణగిరి పాత్రలో ఎస్‌జే సూర్య రెచ్చిపోయారు. ఇటీవలి కాలంలో డిఫరెంట్‌ రోల్స్‌ చేయడంలో వైవిధ్యం చూపించడంలో సక్సెస్‌ అవుతున్న ఎస్‌జే సూర్యకు మరోసారి మంచి రోల్‌ దక్కింది. కన్నన్‌గా సూరజ్‌ యాక్టింగ్‌ కూడా బాగుంది. బాగా చేశాడు. ఇక…రవి పాత్రలో థర్టీ ఇయర్స్‌ పృథ్వీకి మంచి వెయిట్‌ ఉన్న క్యారెక్టర్‌ పడింది. పృధ్వీలో ఓ పర్‌ఫెక్ట్‌ విలక్షణత ఈ మూవీలో కనిపించింది. విక్రమ్‌ భార్యగా దుషారా విజయన్‌ ఉన్నంతో మెప్పించారు. బాలాజీ , మారుతి ప్రకాష్‌రాజ్, రమేష్‌ ఇంద్రజ, శ్రీజ రవి, పార్వతీలు వారి వారి పాత్రల పరిధి మేరకు చేశారు. తేనీ ఈశ్వర్‌ కెమెరా పనితనం ఈ సినిమాకు చాలా క్రూషియల్‌. బాగా ఫ్లస్‌ అయ్యింది. జీవీ ప్రకాష్‌ మ్యూజిక్‌ కూడా అదిరిపోయింది. ఎడిటింగ్‌ ఒకే. నిర్మాణ విలువలు ఒకే.

ఫైనల్‌గా..: వీర ధీర శూర..ఓన్లీ యాక్షన్‌

రేటింగ్‌: 2.5/5

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *