vintage Pawankalyan: వింటేజ్‌ పవన్‌కళ్యాణ్‌..ఆన్‌ ది వే!

vintage Pawankalyan: పవన్‌కల్యాణ్‌ స్వాగ్, మేనరిజమ్, స్టైల్‌..ఇలా అన్నీ తెలుగు ప్రేక్షకులకు భలేగా ఇష్టం.

Viswa
1 Min Read
2025 PawanKalyan

పవన్‌కల్యాణ్‌ (vintage Pawankalyan)స్వాగ్, మేనరిజమ్, స్టైల్‌..ఇలా అన్నీ తెలుగు ప్రేక్షకులకు భలేగా ఇష్టం. ఈ విషయాల్లో పవన్‌ ను ఫాలో అయ్యే చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే…రీసెంట్‌గా పవన్‌కళ్యాణ్‌ కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బయటకు వెల్లడైన ఫోటోలు పట్ల నెటిజన్లు, ఇతర హీరోల అభిమానులు పవన్‌కళ్యాణ్‌ను తీవ్రంగా ట్రోల్‌ చేశారు. దీంతో కాస్త అసహనానికి గురైయ్యారట పవన్‌కళ్యాణ్‌. దీంతో వింటేజ్‌ పవన్‌ను మళ్లీ స్క్రీన్‌పై తీసుకురావాలని, ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించారట పవన్‌కల్యాణ్‌. ముందుగా డైటింగ్‌ విషయంలో పవన్‌ స్పెషల్‌ కేర్‌ తీసుకుంటారట. ఆ తర్వాత సరైన పద్దతుల్లో వ్యాయా మాలు చేసి, తన వింటేజ్‌ లుక్‌ను తిరిగి తెచ్చుకోవాలన్నది పవన్‌ కల్యాణ్‌ నెక్ట్స్‌ టార్గెట్‌ అనే టాక్‌ వినిపిస్తోంది.

రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే..!

పవన్‌కళ్యాణ్‌ చేతిలో ప్రజెంట్‌ రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి హరిహరవీరమల్లు కాగా, మరొకటి ఓజి. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కానున్నాయి. ముందుగా..హిస్టారికల్‌ డ్రామా ఫిల్మ్‌ ‘హరిహర వీరమల్లు’ మూవీ మే 9న రిలీజ్‌ కానుంది. గ్యాంగ్‌స్టర్‌ ఫిల్మ్‌ ఓజీ ఈ ఏడాది చివర్లో రిలీజ్‌కు రెడీ కానుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *