సముద్రంపై జరిగే మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న సినిమా ‘మకుటం’ (Makutam Firstlook). ఈ చిత్రంలో విశాల్ హీరోగా నటిస్తున్నాడు. విశాల్ కెరీర్‌లోని ఈ 35వ సినిమాలో అంజలి, దుషార విజయన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తంబి రామయ్య, అర్జై ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. అయితే వినాయకచవితి సందర్భంగా ‘మకుటం’ సినిమాలోని విశాల్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మూడు డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌తో కనిపిస్తున్న విశాల్ లుక్ ఆసక్తికరంగా ఉంది.విశాల్ యంగ్ లుక్, మిడిల్ ఏజ్ లుక్, ఓల్డేజ్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ
మకుటం సినిమాపై ఆడియన్స్‌లో ఉన్న అంచనాలు పెరిగాయి.
ప్రముఖ నిర్మాణసంస్థ సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్‌బీ చౌదరి బ్యానర్‌లో 99వ చిత్రంగా మకుటం రూపుదిద్దుకుంటుంది. రవి అరసు డైరెక్షన్‌లోని ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ స్వరకర్త. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారం భంలో రిలీజ్ కావొచ్చు.