Vishwaksen Funky: ‘జాతిరత్నాలు’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు దర్శకుడు అనుదీప్ (AnudeepKV). ఆ తర్వాత తమిళ హీరో శివ కార్తీకేయన్‌తో ‘ప్రిన్స్’ సినిమా తీశాడు. కానీ ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత అనుదీప్ కథతో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అప్పట్నుంచి అను దీప్‌కు కష్టాలు మొదలైయ్యాయి. ఈ దశలో అనుదీప్ చాలా మంది నిర్మాతలు, హీరోలకు కథలు విని పించాడు. వెంకటేష్, రవితేజలు సానుకూలంగా స్పందించారు. కానీ ఈ ఇద్దరు ఆ తర్వాత అనుదీప్‌తో సినిమాను ఫైనలైజ్ చేయలేదు.
pushpa2 Collections: హిందీలో టాప్ ప్లేస్‌కి పుష్ప 2 ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా?
ఇప్పుడు విశ్వక్‌సేన్ ఒకే చేశాడు. అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ (Vishwaksen) హీరోగా ‘ఫంకీ’ (Funky) అనే సినిమా ఖరారైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తు న్నారు. బుధవారం ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. అనుదీప్‌ను దర్శకుడిగా పరిచయం చేసిన నాగ్ అశ్విన్ ఈ సినిమాకు ఓ గెస్ట్‌గా వచ్చారు. అప్పట్లో జాతిరత్నాలు సినిమాకు నాగ్ అశ్విన్ ఓ నిర్మాత. 2025 సంక్రాంతి తరవాత ఫంకీ సినిమాను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. 2025లోనే రిలీజ్ ఉండొచ్చు. ‘ఫంకీ’ సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన అనుదీప్ కెరీర్ మరింత ప్రాబ్లమ్‌లోకి వెళ్తుంది. సో…ఈ సినిమా రిజల్ట్ అనుదీప్‌కి డూ ఆర్ డై సిట్చ్యూవేషన్ లాంటిది. మరి..ఏం జరుగుతుందో చూడాలి. ఇక ‘ఫంకీ’ సినిమాలో ఆషికా రంగనాథన్ హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది.
pushpa2 Collections: హిందీలో టాప్ ప్లేస్‌కి పుష్ప 2 ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా?