War2 Remunerations: ‘వార్ 2’ (War2) సినిమా రెమ్యూనరేషన్ విషయంలో ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తుంది. అదెంటంటే…ఈ సినిమాలో హ్రితిక్‌రోషన్ కంటే, ఎన్టీఆర్‌కు ఎక్కువ రెమ్యూనరేషన్ లాభించిందని టాక్. ఈ ‘వార్ 2’ సినిమాకు గాను ఎన్టీఆర్ దాదాపు. రూ. 65 కోట్ల రూపాయాల రెమ్యూనరేషన్ అందుకుంటే, హ్రితిక్‌రోషన్‌కు మాత్రం రూ. 50 కోట్లనే ముట్టజెప్పారట ఈ చిత్రం నిర్మాణసంస్థ వైఆర్‌ఎఫ్ నిర్మాతలు. ఈ సినిమా హీరోయిన్ కియారా అద్వానీకి రూ. 15 కోట్లు, అనిల్‌కపూర్‌కు రూ. 10 కోట్లు పారితోషికంగా అప్పగించారట మేకర్స్ (War2 Remunerations).మొత్తం ‘వార్ 2’ సినిమా బడ్జెట్ రూ. 400 కోట్ల రూపాయాలు అయ్యిందని బాలీవుడ్ సమాచారం.
అయితే ఎన్టీఆర్ కంటే, హ్రితిక్ రోషన్‌కి ఎందుకు తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారనే చర్చ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ గట్టిగా వినిపిస్తోంది. అయితే హ్రితిక్‌తో ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా తీసి, ఓ మంచి హిట్ అందుకున్నాడు సిద్దార్థ్ ఆనంద్. ఆ తర్వాత హ్రితిక్-సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో ‘వార్’ సినిమాను 201వ’వార్’ సినిమాకు లాభాలు వస్తే , ఆ లాభాల్లో వాటాలు ఇవ్వాలని కండీషన్ పెట్టారు. వైఆర్‌ఎఫ్ వాళ్లు అంగీకరించారు. ‘వార్’ సినిమా సూపర్‌హిట్ అయ్యింది. దీంతో హ్రితిక్‌రోషన్ అందుకునే రెగ్యులర్ అమౌంట్ కన్నా కాస్త ఎక్కువగానే, ‘వార్’ సినిమాకు వచ్చింది.
ఇప్పుడు కూడా సేమ్ ఫార్మాలను అప్లై చేశాడు హ్రితిక్‌రోషన్. ‘వార్ 2’ సినిమాకు పారితోషికంగా రూ. 50 కోట్లు తీసుకుని, ‘వార్ 2’ లాభాల్లో షేర్ అడిగాడు. ‘వార్’ విజయం సాధించడంతో, ఆటోమేటిక్‌గా ‘వార్ 2’ సినిమాపై అంచనాలు ఉంటాయి. ‘వార్ 2’ ట్రైలర్‌లో హిట్ కళ కనిపిస్తోంది. ఇప్పుడు ‘వార్ 2’ హిట్టైతే, లాభాలు తీసుకుంటాడు హ్రితిక్.
ఇలా..ఎక్కువగా లాభపడేది హ్రితిక్‌రోషనే. అదీ సంగతి.
ఇక ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.