Yash Toxic Movie: ‘కేజీఎఫ్’ సినిమాతో సూపర్‌స్టార్ డమ్ దక్కించుకున్న యశ్ హీరోగా చేస్తున్న తాజా సినిమా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (Yash Toxic Movie). మలయాళ దర్శకురాలు గీతూమోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ గురువారం (జనవరి 8న) యశ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలో రాయ పాత్రలో యశ్ నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఈ సినిమా నుంచి యశ్ ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
స్మసానంలో జరిగే ఓ భారీ బాంబ్‌బ్లాస్ట్ విజువల్స్‌తో ఈ వీడియోలో కనిపించాయి. అలాగే ఈ విజువల్‌కు ముందు కాస్త బోల్డ్ కంటెంట్ ఉన్న సన్నివేశాలు వీక్షకులకు కనిపించాయి. ఈ సీన్ కాస్త అభ్యంతరకరంగానే ఉంది. దర్శకురాలు గీతూమోహన్‌దాస్‌తో కలిసి ‘టాక్సిక్’ సినిమాకు యశ్ (Yash as raya) కథ అందిస్తున్నాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై యశ్, వెంకట్.కె.నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘టాక్సిక్’ సినిమాను మార్చి 19న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణీవసంత్, హ్యూమాఖురేషీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇలా ఈ సినిమాలో ఐదు గురు హీరోయిన్స్ నటించడం విశేషం. పెద్దవారికి సందేశం ఇచ్చేలా, ఈ సినిమా ఉంటుందని ఓ సందర్భంగా యశ్ పేర్కొన్నారు.