Toxic Release: యశ్‌ టాక్సిక్‌ వాయిదా

Viswa
2 Min Read
Yash Toxic Movie Relese date

‘కేజీఎఫ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్స్‌ తర్వాత కన్నడ స్టార్‌ హీరో యశ్‌ (Yash) యాక్ట్‌ చేస్తున్న ‘టాక్సిక్‌ (Toxic Release)’. ఈ యాక్షన్‌ అడ్వెంచరస్‌ మూవీకి మలయాళ దర్శకురాలు గీతూమోహన్‌దాస్‌ డైరెక్షన్‌ చేస్తున్నారు. కేవీన్‌ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్‌ మైండ్స్‌ బ్యానర్స్‌పై వెకంట్‌ నారాయణ, యశ్‌ నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా కియారా అద్వానీతో పాటుగా, మరికొంతమంది పేర్లు తెరపైకి వచ్చినా, ఎవరు ఇంకా ఫైనలైజ్‌ కాలేదు.

టాక్సిక్‌ రిలీజ్‌ డేట్‌ చేంజర్‌!

యశ్‌ ‘టాక్సిక్‌’ మూవీని 2023 డిసెంబరులో ప్రకటించారు. ఆ టైటిల్‌ టీజర్‌లో ఈ టాక్సిక్‌ మూవీని ఏప్రిల్‌ 10, 2025న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ వెల్లడించారు. కానీ ఈ మూవీ రిలీజ్‌ వాయిదా పడింది. టాక్సిక్‌మూవీని 2026 మార్చి 19 (yash Toxic Movie Release Date) న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ లేటెస్ట్‌గా ప్రకటించారు.

మార్చిలో భారీ చిత్రాలు

మార్చి 19న యశ్‌ ‘టాక్సిక్‌’ మూవీ రిలీజ్‌ అవుతోంది. అయితే ఇదే రోజున రణ్‌బీర్‌కపూర్‌ – విక్కీకౌశల్‌– ఆలియాభట్‌ల ‘లవ్‌ అండ్‌ వార్‌’ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇదే నెలలో మార్చి 26న రామ్‌చరణ్‌ పెద్ది, నాని ‘ప్యారడైజ్‌’ చిత్రాలూ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అయితే ఈ నాలుగు భారీ చిత్రాల్లో ఏవో రెండు సినిమాలు మాత్రం కచ్చితంగా వాయిదా పడతాయి. మరి..ఇలా వాయిదా పడే చిత్రాలేవో తెలియా లంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు మరి..!

రామాయణ

హిందీ రామాయణ మూవీలో యశ్‌ రావణుడి పాత్రలో యాక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమాకు ఓ నిర్మాతగా కూడ యశ్‌ ఉన్నాడు. ఇటీవలే ‘రామాయణ’ చిత్రీకరణలో యశ్‌ పాల్గొన్నాడు. దీంతో టాక్సిక్‌ మూవీ షూటింగ్‌కు కాల్షీట్స్‌ కేటాయించడంతో, యశ్‌ కాస్త ఇబ్బందిపడుతున్నాడు. ‘టాక్సిక్‌’ రిలీజ్‌ వాయిదా పడటానికి ఇదొక కారణం. ఇక ఈ చిత్రంలో రాముడి పాత్రలో యశ్, సీతగా సాయిపల్లవిలు యాక్ట్‌ చేస్తున్నారు. 2026 దీపావళికి ఈ మూవీ తొలిపార్టు రిలీజ్‌ కానుంది. 2027 దీపావళికి మలిపార్టు రిలీజ్‌ కానుంది. నితీష్‌ తివారి ఈ సినిమాకు దర్శకుడు. నమిత్‌ మల్హోత్రా నిర్మాత.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *