Yuganiki Okkadu Sequel: తమిళంలో ‘ఆయిరతిల్ ఓరువన్’ అంటే… తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ.. .‘యుగానికి ఒక్కడు’ (Yuganiki Okkadu) అంటే మాత్రం తెలుగు సినీ లవర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. సెల్వరాఘవన్ డైరెక్షన్‌లో కార్తీ, రీమాసేన్, ఆండ్రియా, పార్తీబన్ మెయిన్ లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేసిన ఈ ‘ఆయిరతిల్ ఓరువన్’ మూవీ 2010లో విడుదలై, సంచలన విజయం సాధించింది. తెలుగులో ‘యుగానికి ఒక్కడు’గా అనువాదమైన ఈ మూవీ, ఇక్కడ సూపర్‌హిట్ కొట్టింది. తాజాగా ఈ మూవీని మార్చి 14న..రీరిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ చేస్తున్నారు.
నాలుగేళ్ల క్రితమే ప్రకటన
నాలుగు సంవత్సరాల క్రితం ‘ఆయిరతిల్ ఒరువన్’ (Aayirathil Oruvan) సినిమాకు సీక్వెల్‌గా ‘ఆయిరతిల్ ఒరువన్ 2’ (Aayirathil Oruvan2)ను అనౌన్స్ చేశాడు దర్శకుడు సెల్వరాఘవన్. హీరో మాత్రం కార్తీ కాదు. తన తమ్ముడు ధనుష్‌ను హీరోగా, ‘ఆయిరతిల్ ఒరువన్ 2’ను ప్రకటించాడు. 2021 జనవరి 1న ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత «2024లో రిలీజ్ చేస్తామని అప్పట్లో ప్రకటించారు. కానీ ఈ సినిమా ఇప్పటి వరకు సెట్స్‌పైకి వెళ్లలేదు. ఓ రకంగా…‘ఆయిరతిల్ ఒరువన్’ సినిమా సీక్వెల్ ఆగిపోయినట్లేనన్న టాక్ కోలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది.
ధనుష్ బిజీ బీజీ
«నటుడిగా, దర్శకుడిగా ధనుష్ ప్రజెంట్ ఫుల్ బిజీగా ఉన్నాడు. నెక్ట్స్ మూడు సంవత్సరాలకు సరిపడా ప్రాజెక్ట్స్‌ను కూడా ధనుష్ లైన్లో పెట్టాడు. మరోవైపు ‘7జీ బృందావనకాలనీ’ సీక్వెల్‌తో దర్శకుడిగా, ఇతర సినిమాల్లో యాక్టర్‌గా సెల్వరాఘవన్ బిజీగా ఉన్నారు. దీంతో..‘ఆయిరతిల్ ఒరువన్ 2’ సీక్వెల్ ఆల్మోస్ట్ ఆగిపోయినట్లేనన్న టాక్ వినిపిస్తోంది.