పతంగుల పోటీ నేపథ్యంతో రూపొందుతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’. జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్, ఇన్‌స్టాగ్రామ్ సన్సేషన్ ప్రీతి పగడాల, వంశీ పూజిత్ ఈ సినిమాలోని ప్రధాన తారాగణంగా నటించారు. ప్రముఖ సింగర్ ఎస్‌పీ చరణ్ మరో కీలక పాత్రలో నటించారు. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించగా, ఈ సినిమాకు ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ పతంగ్ సినిమాను డిసెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు.
”థియేటర్స్‌లో ‘పతంగ్’ సినిమా యూత్‌ఫెస్టివల్‌లా ఉంటుంది. కథే ఈ సినిమాకు హీరో. పతంగ్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం అవుతుందనే నమ్మకం ఉంది. తెలుగు ప్రేక్షకులు మా కొత్త ప్రయత్నాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది” అని చిత్రంయూనిట్ పేర్కొంది.