71thnational film Awards:
71వ జాతీయ సినిమా అవార్డ్స్ లను శుక్రవారం ప్రకటించారు. స్పెషల్ మెన్షన్స్ తో కలిపి ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మొత్తం 40 అవార్డ్స్ ను ప్రకటించారు. నాన్ ఫీచర్ విభాగం లో, స్పెషల్ మెన్షన్స్ తో కలిపి మొత్తం 15 విభాగాల్లో అవార్డ్స్ ను ప్రకటించారు. అస్సామి ఫిల్మ్ క్రిటిక్ ఉత్పల్ దత్తా అవార్డు గెలుచుకున్నారు. 2023లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ చేయబడిన సినిమాలను పరిగణన లోకి తీసుకుని ఈ అవార్డ్స్ ను ప్రకటించడం జరిగింది.(71thnational film Awards)
ఈ 71వ జాతీయ సినిమా అవార్డ్స్ లో ఈ సారి హిందీ సినిమా దుమ్మురేపింది. ప్రధాన విభాగలైన బెస్ట్ పిక్చర్ (12th ఫెయిల్), బెస్ట్ యాక్టర్ (షారుక్ ఖాన్ – జవాను, విక్రాంత్ మెస్సే – 12Th ఫెయిల్) , బెస్ట్ యాక్ట్రెస్ (రాణి ముఖర్జీ ) బెస్ట్ డైరెక్టర్…. అవార్డ్స్ హిందీ సిని మాకే వచ్చాయి. ఇంకా రణబీర్ కపూర్ ‘యానిమల్ (బ్యాగ్రౌండ్ స్కోర్, రీరికార్డింగ్ మిక్సర్, సౌండ్ డిజైనర్స్- జ్యూరీ స్పెషల్ మెన్షన్), విక్కీ కౌశల్ ‘ సామ్ బహదూర్'(జాతీయ సమైగ్రత చిత్రం, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ మేకప్) సినిమాలు మూడేసి చొప్పున అవార్డ్స్ ని సొంతం చేసుకుని, ముందు వరసలో నిలిచాయి. జవాను, రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ,ది కేరళ స్టోరీ, 12th ఫెయిల్ వంటి హిందీ సినిమాలు రెండేసి అవార్డ్స్ ను సొంతం చేసుకున్నాయి.
ఇక ఈ అవార్డ్స్ లో తెలుగు సినిమా కూడా సత్తా చాటింది. ప్రాంతీయ ఉత్తమ తెలుగు సినిమా గా భగవంత్ కేసరి సినిమా నిలిచింది. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోని హను-మాన్ సినిమాకి రెండు అవార్డులు, ఆనంద్ దేవరకొండ -విరాజ్- వైష్ణవి చైతన్య లీడ్ యాక్ట్రెస్ గా చేసిన బేబీ సినిమాకు రెండు అవార్డ్స్ వచ్చాయి. బలగం సినిమా లో మాది పల్లెటూరు అనేలా మంచి పాట రాసిన కాసర్ల శ్యామ్ కి,, బెస్ట్ లిరిక్స్ రైటర్అవార్డు వచ్చింది. తెలుగు సినిమాకు కాకపోయినా మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ కు, యానిమల్ సినిమాకి కాను బెస్ట్ ఆర్ఆర్… బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవార్డు వచ్చింది. సాయి రాజేష్ కు బేబీ సినిమా కు గాను, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రైటింగ్ అవార్డు రావడం జరిగింది. ఇక ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా జీవి ప్రకాష్ కుమార్ నిలిచారు. తమిళ్ సినిమా ధనుష్ వాతి కి గాను, ఆయన బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఇక నటించిన తొలి సినిమా తోనే, ఉత్తమబాలనటి అవార్డు ను గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్శించారు సుకుమార్ కుమార్తె సుకృతి బండ్రేడ్డి. గాంధీ తాత చెట్టు సినిమా కుగాను, ఈ బాలనటికి అవార్డు వచ్చింది.
ఇక సుధీర్గమైన 33 సంవత్సరాల సినిమా కెరియర్లో తొలిసారి జవాన్ సినిమాకు గాను, తొలిసారి జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచారు షారుఖ్ ఖాన్. ఇంకా 12th ఫెయిల్ సినిమాలో నటించిన విక్రాంత్ మెస్సేకూ, బెస్ట్ యాక్ట్రెస్ గా నిలిచిన రాణి ముఖర్జీ కి కూడా ఇదే తొలి జాతీయ అవార్డు కావడం విశేషం. సాయి రాజేష్, జీవి ప్రకాష్ కుమార్, ఊర్వశి లకు… రెండో సారి జాతీయ అవార్డ్స్ వచ్చాయి.
పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ అవార్డ్స్ లిస్ట్ చేయండి….
కొంత లిస్ట్… ఇదిగో… చదవండి…
🎭 నటన విభాగం (Performance Awards)
ఉత్తమ నటుడు (Best Actor):
- షారూఖ్ ఖాన్ – జవాన్ (హిందీ)
- విక్రాంత్ మాస్సే – 12th ఫెయిల్ (హిందీ)
ఉత్తమ నటి (Best Actress):
- రాణీ ముఖర్జీ – మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే (హిందీ)
ఉత్తమ సహాయ నటుడు (Best Supporting Actor):
- విజయరాఘవన్ – పొక్కాలమ్ (మలయాళం)
- మధుపెట్టయి సోము భాస్కర్ – పార్కింగ్ (తమిళం)
ఉత్తమ సహాయ నటి (Best Supporting Actress):
- ఊర్వశి – ఉళ్లోళుక్కు (మలయాళం)
- జంకీ బోడివాల – వశ్ (గుజరాతీ)
ఉత్త బాల నటులు (Best Child Artist):
- సుకృతి వేణి బండ్రెడ్డి – గాంధీ తాత చెట్టు (తెలుగు)
- కబీర్ ఖాండరి – జిప్సీ (మరాఠీ)
- త్రిష తోసార్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ జగ్తాప్ – నాల్ 2 (మరాఠీ)
🎶 గానం & సంగీత విభాగం (Music & Singing)
ఉత్తమ గాయకుడు (Best Male Playback Singer):
- పీవీఎన్‌ఎస్ రోహిత్ – “ప్రేమిస్తున్నా..” – బేబీ (తెలుగు)
ఉత్తమ గాయనిని (Best Female Playback Singer):
- శిల్పా రావు – “చెలియా..” – జవాన్ (హిందీ)
ఉత్తమ సంగీత దర్శకుడు (నాన్-ఫీచర్):
- ప్రణీల్ దేశాయ్ – ద ఫస్ట్ ఫిలిం (హిందీ)
🎥 టెక్నికల్ విభాగం (Technical Awards)
ఉత్తమ సినిమాటోగ్రఫీ (ఫీచర్):
- ప్రసంతను మొహపాత్ర – ద కేరళ స్టోరీ
ఉత్తమ సినిమాటోగ్రఫీ (నాన్-ఫీచర్):
- శరవణముత్తు సౌందరపండి, మీనాక్షి సోమన్ – లిటిల్ వింగ్స్ (తమిళం)
ఉత్తమ స్క్రీన్‌ప్లే:
- సాయిరాజేశ్ నీలం – బేబీ
- రాంకుమార్ బాలకృష్ణన్ – పార్కింగ్
ఉత్తమ డైలాగ్ రచయిత:
- దీపక్ కింగక్రాని – సిర్ఫ్ ఏక్ బండా కాఫీ హై
ఉత్తమ ఎడిటింగ్ (నాన్ ఫీచర్):
- నీలాద్రి రాయ్ – మూవింగ్ ఫోకస్
ఉత్తమ సౌండ్ డిజైన్ (నాన్ ఫీచర్):
- శుభరుణ్ సేన్‌గుప్తా – దుండగిరి కె పూల్
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ (స్టంట్ కొరియోగ్రఫీ):
- నందు, పృథ్వి – హనుమాన్
స్పెషల్ మెన్షన్ (రీరికార్డింగ్ మిక్సింగ్):
- ఎం.ఆర్. రాజకృష్ణన్ – యానిమల్
🌍 భాషల వారీగా ఉత్తమ చిత్రాలు (Best Regional Films)
- ఉత్తమ తమిళ చిత్రం: పార్కింగ్
- ఉత్తమ మలయాళ చిత్రం: ఉల్లొళు
- ఉత్తమ హిందీ చిత్రం: కాథల్
- ఉత్తమ మరాఠీ చిత్రం: శ్యాంచీ ఆయ్
- ఉత్తమ ఒడియా చిత్రం: పుష్కర
- ఉత్తమ కన్నడ చిత్రం: కందిలు
- ఉత్తమ గుజరాతీ చిత్రం: వశ్
- ఉత్తమ పంజాబీ చిత్రం: గొడ్డే గొడ్డే చా
- ఉత్తమ బెంగాలీ చిత్రం: డీప్ ఫ్రిడ్జ్
- ఉత్తమ అస్సామీ చిత్రం: రొంగటపు 1982
📽️ నాన్ ఫీచర్ ఫిలిం విభాగం
ఉత్తమ డైరెక్షన్ (Direction):
- పీయూష్ ఠాకూర్ – ద ఫస్ట్ ఫిలిం
ఉత్తమ స్క్రిప్ట్ (Script):
- చిదానంద నాయక్ – Sunflowers Were the First Ones to Know (కన్నడ)
ఉత్తమ వాయిస్ ఓవర్:
- హరికృష్ణన్ ఎస్ – The Sacred Jack (ఇంగ్లీష్)
ఉత్తమ డెబ్యూ డైరెక్టర్:
- శిల్పిక బోర్డొలాయ్ – మావ్: ద స్పిరిట్ డ్రీమ్స్ ఆఫ్ చెరియూ (మిజోరాం)
ఉత్తమ షార్ట్ ఫిలిం:
- గిద్ – ద స్కావెంజర్
ఉత్తమ నాన్ ఫీచర్ ఫిలిం:
- ఫ్లవరింగ్ మ్యాన్ (హిందీ)
ఉత్తమ డాక్యుమెంటరీ:
- గాడ్ వల్చర్ అండ్ హ్యుమన్ (ఇంగ్లీష్, హిందీ, తెలుగు)
ఉత్తమ సోషియల్ & ఎన్విరాన్‌మెంటల్ విలువల ఫిలిం:
- ద సైలెంట్ ఎపిడమిక్ (హిందీ)
ఉత్తమ ఆర్ట్స్/కల్చర్ ఫిలిం:
- టైమ్‌లెస్ తమిళనాడు (ఇంగ్లీష్)
ఉత్తమ బయోగ్రఫికల్/హిస్టారికల్ ఫిలిం:
- మా బో, మా గాన్ (ఒడియా)
- లెంటినా ఓ: ఎ లైట్ ఆన్ ద ఈస్ట్రన్ హారిజన్ (ఇంగ్లీష్)
🖋️ విమర్శా విభాగం (Critics)
ఉత్తమ చలనచిత్ర విమర్శకుడు:
- ఉత్పల్ దత్తా (అస్సామీస్)