ప్రభాస్ ‘రాజాసాబ్’ (The Raja Saab) సినిమా వాయిదా పడింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ సినిమాకు, మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంజయ్‌దత్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు.‘రాజాసాబ్’ సినిమాను ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉంది. కానీ ఏప్రిల్ 10న రాజాసాబ్ (The Raja Saab) విడుదల కావడం లేదని తెలిసింది. హెవీ గ్రాఫిక్స్ వర్క్స్ పెండింగ్ ఉండటమే రాజాసాబ్ సినిమా వాయిదాకు ప్రధాన కారణమని తెలిసింది.
Prabhas: గాయపడ్డ ప్రభాస్…జపాన్ టూర్ క్యాన్సిల్
ఇటీవల ఓ సినిమా చిత్రీకరణలో ప్రభాస్ కాలికి గాయమైంది. దీంతో చికిత్స కోసం ప్రభాస్ జర్మనీ వెళ్లారని తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజి’, రాజాసాబ్ సినిమాలు చేస్తున్నారు. సందీప్‌రెడ్డివంగాతో ‘స్పిరిట్’, హోంబలే ఫిలింస్ సంస్థతో మరో మూడు సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి.