Kishkindhapuri Teaser: కిష్కింధపురిలో అహం మృత్యు

Viswa
1 Min Read
Kishkindhapuri Movie Glime out now

Web Stories

బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ లేటెస్ట్‌ హారర్‌ అండ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘కిష్కింధపురి(Kishkindhapuri)’.‘రాక్షసుడు’ మూవీ తర్వాత ఈ మూవీ కోసం బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమాపరమేశ్వరన్‌ మళ్లీ కలిసి వర్క్‌ చేస్తున్నారు. కౌశిక్‌ పెగల్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లేటెస్ట్‌గా ఈ మూవీ గ్లింప్స్‌ (Kishkindhapuri Teaser)వీడియోను రిలీజ్‌ చేశారు.

సామ్‌ సీఎస్‌ మ్యూజిక్‌ బాగుంది. ‘క, పుష్పది రూల్‌’ వంటి సినిమాలకు సంగీతం అందించిన సామ్‌ సీఎస్‌ ఈ మూవీకీ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. హారర్‌ మూవీ కాబట్టి…ఈ తాలుకూ మ్యూజిక్‌ను ఇవ్వగలిగాడు. ఇక కిష్కింధపురి గ్లింప్స్‌లో పెద్దగా డైలాగ్స్‌ ఏమీ లేవు. కానీ…‘కొన్ని గొంతులు ఎప్పటికీ వినిపించకూడదు, కొన్ని ప్లేస్‌లు ఎప్పటికీ మర్చిపోకూడదు’ అన్న అని అర్థం వచ్చేలా ఇంగ్లీస్‌లో వాఖ్యాలు ఉన్నాయి. ఇక బెల్లంకొండ చెప్పిన ఒకే ఒక డైలాగ్‌ ‘అహం మృత్యు’. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కెరీర్‌లోని ఈ 11వ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాయే కాకుండా…టైసన్‌ నాయుడు అనే పోలీస్‌ డ్రామా, హైంధవ అనే మైథలాజికల్‌ ఫిల్మ్, భైరవం అనే కమర్షియల్‌ ఫిల్మ్స్‌ చేస్తున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. ఈ ఏడాది బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ నుంచి మూడు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

Please Share
Share This Article
4 Comments
Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu