SSMB29: మహేశ్‌బాబు (MaheshBabu) హీరోగా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ఫిల్మ్ రానుంది. దాదాపు వెయ్యికోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం జరుగుతుందని తెలిసింది. హాలీవుడ్ స్థాయి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగస్వామ్యం కానున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు చెందిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరిగాయి. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారు. ఫారెస్ట్ అడ్వెం చరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంకా చోప్రా, విలన్‌గా మలయాళ నటుడు ఫృథ్వీరాజ్‌సుకుమారన్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమాకు టైటిల్స్‌గా మహారాజు అనే పేరుకూడా తెరపైకి వచ్చింది. ఈ నెలలోనే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటన్నారు. ఈ చిత్రం దర్శకుడు రాజమౌళి కెన్యా, నేపాల్‌లో లొకేషన్స్‌ను కూడా పరిశీలించారు. ఆల్రెడీ హైదరాబాద్ శివర్లలో భారీ సెట్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ సినిమా (SSMB29) ప్రారంభోత్సవం జనవరి 2న జరగనుందని తెలిసింది. ఈ సినిమాలోని తన ప్రత్యేకమైన లుక్ కోసం మహేశ్‌బాబు జర్మనీ లో ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు.
Nagavamsi:తెలుగు ప్రముఖ నిర్మాత నాగవంశీపై బాలీవుడ్ దర్శకుల వ్యంగ్యాస్త్రాలు
ఇది కేవలం ప్రాధమిక పూజా కార్యక్రమం మాత్రమే. అయితే తన సినిమాల పూజా కార్యక్రమాలకు మహేశ్ బాబు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మరి..ఈ సినిమా ఓపెనింగ్‌కు వస్తారా? లేదా అనే విషయంపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మహేశ్‌బాబు కెరీర్‌లోని ఈ 29వ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామా అని, ఓ నిధి అన్వేషణగా ఈ సినిమా కథ సాగుతుందని, రెండు పార్టులుగా సినిమా విడు దల కానుందనే ప్రచారం సాగుతోంది.
సాధారణంగా సినిమాను స్టార్ట్ చేసేముందు ఈ చిత్రం దర్శకుడు రాజమౌళి ఓ ప్రెస్‌మీట్ నిర్వహించి, ఆ సినిమా వివరాలు, విశేషాలను వెల్లడిస్తుంటారు. మరి..ఈ సారి కూడా ఈ తరహా ప్రెస్‌మీట్ ఎప్పుడూ జరగబోతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.