Chiranjeevi Movie‘విశ్వంభర’ తర్వాత చిరంజీవి (Chiranjeevi Movie) నెక్ట్స్ ఫిల్మ్ ఎవరితో ఉంటుందనే విషయంపై ఓ స్పష్టత వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సినిమా ఈ వేసవిలో పెట్టాలెక్కనుందని తెలిసింది. సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించనున్నారు. చిరంజీవిని ఈ శుక్రవారం సాహుగారపాటి కలిశారు. వీరిద్దరిఈ సినిమాకు సంబంధించిన చర్చలు జరిగాయని తెలిసింది.
నిజానికి చిరంజీవి తర్వాత తనతో ‘గాడ్‌ఫాదర్’ తీసిన మోహన్‌రాజాతో ఉండాల్సింది. బీవీఎస్ రవి కథ అందిస్తున్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితా నిర్మాణసంస్థ గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపైఈ మూవీ ఉండాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. అసలు..‘విశ్వం భర’ కంటే ముందే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సింది. పలు కారణాల వల్ల ఈ సినిమా ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు.
Daaku Maharaaj: దబిడి దిబిడి..డాకు మహారాజ్‌కు డ్యామేజ్!

దీంతో అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో సినిమా చేసేందుకు చిరంజీవి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిరంజీవి అనుకుంటున్నారట. అనిల్‌రావిపూడి సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ సాధించాయి. ఉదాహరణగా ఎఫ్2ను చెప్పుకోవచ్చు. సో…మరి చిరంజీవి– అనిల్ రావిపూడిల సినిమా సంక్రాంతికి వస్తుందెమో చూడాలి.
Chiranjeevi157: చిరంజీవితో దసరా దర్శకుడు
చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రం ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. ఈ వేసవిలో రిలీజ్ ఉండొచ్చు. ‘విశ్వంభర’ సినిమా రిలీజైన ప్పుడు ఈ సినిమా గ్రాఫిక్స్ విజువల్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ‘విశ్వంభర’ సినిమా గ్రాఫిక్స్‌పై వర్క్ జరుగుతోంది. ఈ వేసవిలో విశ్వంభర చిత్రం రిలీజ్ ఉండొచ్చు. ఇక అనిల్‌రావిపూడి మూవీ తర్వాత ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మూవీ చేస్తారు చిరంజీవి.
ఎన్టీఆర్ సినిమా కూడ సంక్రాంతికే…!

ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ కాంబినేషన్‌లో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రానుంది. సంక్రాంతి తర్వాత కర్ణాటకలో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. మైత్రీమూవీమేకర్స్ పతా కంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్‌లో రుక్మిణీవసంత్ హీరోయిన్‌గా నటిస్తారు. కాగా ఈ మూవీని మేకర్స్ జనవరి 9, 2026న రిలీజ్ చేయను న్నట్లుగా ప్రకటించారు. ఒకవేళ చెప్పిన తేదీకే ‘డ్రాగన్’ మూవీ కూడా వస్తే….బాక్సాఫీస్ వద్ద చిరంజీవి వర్సెస్ ఎన్టీఆర్ ను ఆడియన్స్ చూస్తారు.