ఈ ఏడాది రిలీజ్ డేట్స్‌లో ఏప్రిల్ 10 (April10 Release) చాలా కంఫర్టబుల్ డేట్. అప్పటికే విద్యార్థుల ఎగ్జామ్స్ పూర్తవుతాయి. వేసవి సెలవులు ఉంటాయి. పైగా లాంగ్ వీకెండ్. దీంతో ఈ టైమ్‌ను క్యాష్ చేసుకోవడానికి సినిమాలు పోటీ పడుతున్నాయి. పెద్ద స్టార్ హీరోలు సైతం పోటీకి దిగుతున్నారు.
Kajal Aggarwal: పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్!
తొలుత ఏప్రిల్ 10 రిలీజ్‌కు కర్ఛీప్ వేసింది ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ (Yash). మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌తో ‘టాక్సిక్’ (Toxic) అనే మూవీని చేస్తున్నాడు యశ్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ రణ్‌బీర్‌కపూర్ హిందీ రామాయణ మూవీలో రావణుడిగా యశ్ యాక్ట్ చేశాడు. పైగా ఈ సినిమాకు యశ్ ఓ నిర్మాత కూడా. ఇలా ‘టాక్సిక్’ చిత్రీకరణ లేట్ అయ్యింది. దీంతో ‘టాక్సిక్’ మూవీ ఏప్రిల్ 10 రిలీజ్‌ను వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు డిసెంబరులో రిలీజ్ అయ్యేందుకు టాక్సిక్ మూవీ రెడీ అవుతోంది.
తెలుగు హీరో తేజా సజ్జా ‘హను–మాన్’ సూపర్‌హిట్ కొట్టాడు. ఈ కుర్ర హీరో చేస్తున్న తాజా మూవీ ‘మిరాయి’. ఈ మూవీని ఏప్రిల్ 10 రిలీజ్‌కి ఫిక్స్ చేశారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్. కానీ టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న మరో మూవీ ప్రభాస్ ‘రాజాసాబ్’ (the Rajasaab) కూడా ఏప్రిల్ 10న రిలీజ్ ప్రకటించారు. దీంతో తేజా సజ్జా ఏప్రిల్ 10ని త్యాగం చేయాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైతే ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్న వార్తలువచ్చాయో…వెంటనే ‘డీజే టిల్లు’ పోరడు సిద్దు జొన్నలగడ్డ ‘జాక్’ (Jack)మూవీని రంగంలోకి దించాడు. ఏప్రిల్ 10న జాక్‌ను రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించాడు.
తెలుగు చిత్రాలు ఇలా ఉండగానే..టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణసంస్థ అయిన మైత్రీమూవీమేకర్స్ లేటెస్ట్ మూవీ తమిళ హీరో అజిత్‌తో చేస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ పేరుతో వస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్‌కు ప్రకటించారు. అయితే…..మైత్రీవాళ్లు ప్రభాస్‌తో ప్రస్తుతం ఫౌజీ అనే మూవీ చేస్తున్నారు. ప్రభాస్‌కు తెలియకుండ ఏప్రిల్ 10న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (good Bad Ugly)ని ప్రకటించరు. ఈ విధంగా ‘రాజాసాబ్’ చిత్రం ఏప్రిల్ 10
నుంచి తప్పుకున్నట్లే.
మరోవైపు తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (idly Kadai) కూడా ఏప్రిల్ 10న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ధనుష్ హీరో. డైరెక్టర్ కూడా ధనుష్‌యే. అలాగే సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు చేసిన ‘రేట్రో’మూవీ కూడా ఏప్రిల్ 10 రిలీజ్ గురించి ఆలోచిస్తుంది. పెద్ద సినిమాలేవీ రాకపోతే, ఏప్రిల్ 10న రావడానికి మరికొన్ని తమిళ, తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. మరి…ఫైనల్‌గా ఏప్రిల్ 10న ఏ మూవీ రిలీజ్ అవుతుందో చూడాలి.
Vishal: విశాల్‌కు ఏమైంది..? మైక్ కూడా పట్టుకోలేకపోతున్నాడు?