దాదాపు పది సంవత్సరాల తర్వాత హీరోయిన్ వామికా గబ్బి (Wamiqa Gabbi) మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. అడివి శేష్ హీరోగా చేస్తున్న ‘గూఢచారి 2’ మూవీలో వామికా గబ్బి ఓ లీడ్ రోల్ చేయనున్నారు. మంగళవారం అధి కారికంగా ప్రకటించారు మేకర్స్. వినయ్ కుమార్ సిరికొండ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవు తున్నారు. ‘గూఢచారి 2’ (G2) మూవీ ప్రస్తుతం పారిస్‌లో చిత్రీకర జరుపుకుంటోంది. ‘గూఢచారి’ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. ‘గూఢచారి’కి సీక్వెల్‌గా వస్తున్న ‘గూఢచారి 2 (gudachari2)’పై అంచనాలు ఉన్నాయి. రీసెంట్ టైమ్స్‌లో ‘కేజీఎఫ్ 2, పుష్ప2, బాహుబలి 2, స్త్రీ 2’…ఇలా సీక్వెల్స్ మంచి విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో గూఢచారి 2 మూవీపై ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.
Hari Hara Veera Mallu Postponed: తీవ్ర నిరాశలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
2015లో సుధీర్‌బాబు హీరోగా చేసిన ‘భలేమంచిరోజు’ మూవీలో వామికా హీరోయిన్‌గా చేశారు. తెలు గులో ఆమెకు ఇది తొలి మూవీ. ఆ తర్వాత వామిక మరో తెలుగు సినిమా చేయలేదు. కానీ బాలీవుడ్‌లో వరస సినిమాలు చేసి, అక్కడ బిజీ హీరోయిన్ అయిపోయారు. ఇప్పుడు ‘గూఢచారి 2’తో మళ్లీ తెలుగు సినిమాకు వచ్చారు.