పవన్‌కల్యాణ్ హీరోగా చేస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘హరిహరవీరమల్లు’ (Hari Hara Veera Mallu). నాలుగేళ్లుగా ఈ సినిమాను తీస్తున్నారు. కాస్త ఆశ్చర్యకరంగా అని పించి నా….హరిహరవీరమల్లు సినిమాను, 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. అప్పట్లో సంక్రాంతి రిలీజ్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కట్ చేస్తే….ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు (Hari Hara Veera Mallu Postponed).
హరిహరవీరమల్లు సినిమాకు తొలుత దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ). కానీ సినిమా సెకండాఫ్ విషయంలో క్రిష్‌కు, పవన్‌కల్యాణ్‌కు మధ్య ఏకాభిప్రాయం కుదర్లేదట. దీంతో ఈ సినిమా నుంచి తప్పు కున్నారు దర్శకుడు క్రిష్. ఈ చిత్రం కథ రచయిత సాయిమాధవ్ బుర్రా కూడ తప్పుకున్నారట.
ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను ‘హరిహరవీరమల్లు’ చిత్రం తర్వాత ఏఎమ్ రత్నం తనయుడు, దర్శక–నిర్మాత జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. కారణాలు ఏమో కానీ…‘హరిహరవీరమల్లు’ మూవీ సడన్‌గా రెండు పార్టులైపోయింది. ‘హరిహరవీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మూవీ ‘హరిహరవీరమల్లు పార్టు 1’గా రిలీజ్ అనుకున్నారు.

ఈ మూవీని మార్చి 28న రిలీజ్ చేయాలనుకున్నారు. రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ పాడిన ‘మాట వినాలి’ పాట లిరికల్ వీడియోను జనవరి 6న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ వాయిదా పడింది. గతంలో కొత్త టీజర్ అంటూ ఇలానే హడావిడి చేసి, లాస్ట్ మినిట్‌లో వాయిదా వేశారు. ఇప్పుడు సాంగ్ విషయంలోనూ అదే జరిగింది. దీంతో కనీసం సినిమా అయినా…చెప్పినట్లుగా మార్చి 28న రిలీజ్ అవుతుందా? లేదా? అని పవన్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
ఇదిలా ఉంటే…హరిహరవీరమల్లు సినిమాకు తాను సరైన సమయంలోనే కాల్షీట్స్ కేటాయించానని, కాకపోతే వాళ్లే వినియోగించుకోలేదని, మరో వారం రోజులు చిత్రీకరణ జరిపితే షూటింగ్ పూర్తవుతుందని ఇటీవల పవన్‌కల్యాన్ వ్యాఖ్యానించడం కొసమెరుపు.

References:
Wind river casino https://rsaqrhw704003.blogdal.com/41981058/casino-of-gold-dein-ultimativer-guide
References:
Roulette com https://isowindows.net/user/tunesea84/
References:
Betano Spielautomaten https://caesars-windsor-casino.online-spielhallen.de/