Nagababu: నటుడు– నిర్మాత, జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు (Nagababu)కు ఆంధ్రప్రదేశ్ మంత్రి పదవి లభించింది. దీంతో మెగాఫ్యామిలీలో ఆనందం రెట్టింపు అయ్యింది. అయితే కూటమి శ్రేణుల్లో మాత్రం నాగబాబుకు మంత్రి పదవి దక్కడం పట్ల భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణ ఉన్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్‌ఎల్‌ఏగా గెలిచిన బాలకృష్ణను కాదని, నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం ఎంత వరకు సబబు? అంటూ బాలకృష్ణ (Balakrishna) అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కొందరు బాలకృష్ణ అభిమానులు అయితే గతంలో ఏపీ సీయం చంద్రబాబు, ఏపీ మంత్రి నారా లోకేష్, ఎమ్‌ఎల్‌ఏ బాలకృష్ణలపై తీవ్ర విమర్శలు చేసిన నాగబాబు వీడియోలను సోషల్‌మీడియాలో షేర్ చేసి, వారి అభిప్రాయాలనువ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పటివరకు కూటమిలో జనసేనకు నలుగురు మంత్రి పదవుల్లో ఉన్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా, కుందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కింది. జనసేన పార్టీలో ఉన్న మూడు మంత్రి పదవులు ఒకే సామాజిక వర్గానికి చెందినవి కావడంతో పవన్‌కళ్యాణ్‌పై కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
రాజ్యసభ సీటు కుదరనందుకేనా?
నాగబాబును ముందుగా రాజ్యసభ ఏంపీగా పంపాలనుకున్నారని, కానీ పవన్‌కళ్యాణ్‌కు ఇందుకు బీజేపీ నుంచి సపోర్ట్ రాకపోవడంతో, సీయం చంద్రబాబుతో చర్చించి, నాగబాబుకు మంత్రి పదవి దక్కేలా పవన్‌కళ్యాణ్ (Pawankalyan) చేశారనే టాక్ రాజకీయ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఒకనొక దశలో టీడీడీ చైర్మన్‌గా నాగబాబు అన్న వార్తలు వచ్చాయి. కానీ తాను దేవుణ్ణి నమ్మనన్న నాగబాబు వీడియోలు ఆ సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మెగా బ్రదర్స్…మెగా హిట్
మెగాబ్రదర్స్ బొమ్మ బ్లాక్‌బస్టర్ అని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) దేశంలోనే రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ దక్కింది. జనసేనగా ఏపీ రాజకీయాల్లో బ్లాక్‌బస్టర్ కొట్టి, పవన్‌కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కింది.
What’s uup tto every body, it’s my first payy a qukck visit of tgis wweb site; this webpoage contaikns amazinbg aand
acctually good information inn support oof visitors. xnxx