కిరణ్‌ అబ్బవరం డేరింగ్‌ స్టెప్‌….దర్శకుడిగా తొలి సినిమా స్టార్ట్‌

Viswa
1 Min Read

Web Stories

Kiran Abbavaram: హీరో కిరణ్‌ అబ్బవరం కొత్త ప్రయాణం మొదలుపెట్టాడు. దర్శకుడిగా మెగాఫోన్‌ పట్టాడు. ఇప్పటివరకు రచయితగా, నిర్మాతగా, హీరోగా సినిమాలు చేసిన ఈ యంగ్‌ హీరో ఇప్పుడు దర్శకుడి అవతారం ఎత్తారు. కిరణ్‌అబ్బవరం హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ప్రారం భోత్సవం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమా ప్రీ లుక్‌ను కూడా రిలీజ్‌ చేశారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథగా, ఈ సినిమా ఉంటుందని తెలిసింది(Kiran Abbavaram Begins His Journey as Director).

దేవికభట్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్‌కుమార్, సాయికుమార్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జాయ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై సుధాకర్‌ చాగంటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లో ఈ 13వ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలని కిరణ్‌ భావిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రియాలిటీ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని తెలిసింది. ఇక ‘క’, ‘కె–ర్యాంప్‌’ వంటి చిత్రాలతో హీరోగా, ‘తిమ్మరాజు పల్లిటీవీ’ చిత్రంతో నిర్మాతగా కిరణ్‌ ఇటీవల సత్తా చాటారు. ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తోన్న కిరణ్‌ ఇప్పుడు దర్శకుడిగానూ మారడం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu