Spirit Movie Release Postponed: ఊహించిందే జరిగింది. ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా (Spirit Movie Postponed) విడుదల వాయిదా పడింది. ‘స్పిరిట్’ సినిమాను వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ చేయాలని ఈ చిత్రం దర్శకుడు సందీప్రెడ్డివంగా ప్లాన్ చేశారు. కానీ ‘ఫౌజీ’ కారణంగా, సందీప్రెడ్డివంగా ప్లాన్ బెడసి కొట్టింది.
‘ఫౌజీ’ సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాకపోవడం, పైగా రీషూట్స్ చేయాల్సి వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ మరింత వాయిదా పడింది. ఇప్పటికే మూడ్నాలుగుసార్లు వాయిదా పడ్డ ‘ఫౌజీ’ సినిమాను వచ్చే వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో ప్రభాస్ కాల్షీట్స్ ‘ఫౌజీ’ సినిమాకు కేటా యించాల్సిన పరిస్థితి. ఈ ప్రభావం ‘స్పిరిట్’ సినిమాపై పడింది. దీంతో ‘స్పిరిట్’ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. ‘స్పిరిట్’ సినిమా వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా అక్టోబరు 29న రిలీజ్ కానుంది. స్పిరిట్ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో, మార్చి 18న ‘ఫౌజీ’ సినిమాను రిలీజ్ చేయాలని ‘ఫౌజీ’ టీమ్ ప్లాన్ చేస్తోంది.
ప్రభాస్ కెరీర్‌లోని 25వ సినిమా ‘స్పిరిట్’. ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా చేస్తుండగా, కాంచన, వివేక్ ఓబెరాయ్, ఐశ్వర్యాదేశాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ‘స్పిరిట్’ సినిమా కాకుండ, ‘కల్కి9898ఏడీ 2’ సినిమా చిత్రీకరణతోనూ ప్రభాస్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.