వెంకటేష్‌ ‘ఏకే 47’ సినిమా ట్రైలర్‌ ఇదిగో..!

Viswa
1 Min Read
Venkatesh AK47 Cinema trailer

Web Stories

Aadarsha Kutumbam trailer: వెంకటేశ్‌ హీరోగా చేసిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ చిత్రాలకు స్టోరీ, డైలాగ్స్‌ అందించారు త్రివి క్రమ్‌. ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన..వెంకటేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా రావడానికి చాలా సమయమే పట్టింది. వీరికాంబినేషన్‌లో రూపొందిన తాజా సినిమా ‘ఆదర్శకుటుంబం హౌస్‌ నెం.47’ అక్టోబరు 30న రిలీజ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ (Aadarsha Kutumbam trailer) ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

రెబల్‌ సోల్జర్‌…బ్రిటీషర్లు పెట్టిన పేరు ఫౌజీ

వెంకటేశ్‌ ఫ్యామిలీ ఇమేజ్‌ తగ్గట్లుగానే కథను డిజైన్‌ చేసి, కాస్త క్రైమ్‌ కామెడీ టచ్‌ ఇచ్చారు త్రివిక్రమ్‌. ఇందుకు కాస్త డార్క్‌ కామెడీ మసాలాను దట్టించారు. వెరసీ…తన ఫ్యామిలీని కాపాడుకునే ఓ తండ్రి పాత్రలో వెంకటేశ్‌ని చూపించారు త్రివిక్రమ్‌. కాస్త ‘దృశ్యం’ సినిమా కూడా గుర్తుకు వచ్చేలా ఈ సినిమా ట్రైలర్‌ ఉంది. కాకపోతే చదువురాని కొడుకు, అప్పులు చేసే పెళ్లాం, మెకానిక్‌ని ప్రేమించే కూతురు… ఇంటి పెద్ద చిట్టిబాబు..ఇలా త్రివిక్రమ్‌ మార్క్‌ ‘ఆదర్శకుటుంబం’ ట్రైలర్‌లో కనిపిస్తోంది. సినిమాలోనూ ఇదే కొనసాగితే వెంకీ ఖాతాలో మరో హిట్‌ పడ్డట్లే. ఇంకా ఇందులో నారా రోహిత్, రావు రమేష్‌ పోలీస్‌ ఆఫీసర్లుగా నటించారు. నివేదాపేతురాజ్‌ ఓ కీలక పాత్రలో నటించగా, డింపుల్‌ హయాతి ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటించారు.

ఉన్నంతలో మనకున్నంతో బతికితే….

 

ఈ చిత్రంలో వెంకటేశ్‌ భార్యగా శ్రీనిధిశెట్టి, కుమార్తెగా యువానా, కుమారుడిగా ప్రజ్వల్‌ నటించారు. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ సినిమాకు తమన్‌ స్వరకర్త.

Please Share
Share This Article
35 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu