Aakasamlo Oka Tara Movie Pre Release Event : దుల్కర్సల్మాన్ (Dulquer Salmaan), సాత్విక వీరవల్లి (Satvika Veeravalli) హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరై య్యారు. మహిళల కలలు నిజం కావాలనే ప్రధానంశంతో రూపొందిన ఈ సినిమా విజయం సాధించాలని, దుల్కర్ సల్మాన్ కెరీర్లో ఆకాశంలో ఒక తార సినిమా ఓ మైల్స్టోన్ మూవీగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. అల్లు అరవింద్, స్వప్నా దత్, సందీప్ గుణ్ణం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న (Aakasamlo Oka Tara Movie Release date) విడుదల కానుంది.

ఆకాశంలో ఒక తార సినిమా తన కెరీర్లో ఒక ప్రత్యేకమైన సినిమా అని, మహిళలకు ఈ సినిమా నచ్చుతుందని దుల్కర్సల్మాన్ చెప్పారు.
ఆకాశంలో ఒక తార సినిమా తన మనసుకు దగ్గరైందని, ఈ సినిమా విజయం పట్ల నమ్మకంతో ఉన్నానని అల్లు అరవింద్ తెలిపారు. దుల్కర్ బాగా నటించడాని, సాత్విక ఫెరార్మెన్స్ ప్రేక్షకులను ఆశ్యర్యపరుస్తుందని, స్టార్ కాబోతున్న ఆమెతో మరో రెండు సినిమాలకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు కూడా అల్లు అరవింద్ తెలిపారు.
ఇండస్ట్రీలో తన పదమూడేళ్ల కష్టాన్ని ప్రేమగా మార్చి, ఈ సినిమా తీశానని పవన్సాధినేని తెలిపారు.
భార్య కలను భర్త సపోర్ట్ చేయడమే ఈ సినిమా కథాంశం అని ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన సందీప్ గుణ్ణం తెలిపారు.
















