ధనుష్ ‘ఓం’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఫోటోలు

Viswa
1 Min Read

Web Stories

Dhanush OM PreRelease event Photos: ధనుష్‌ హీరోగా నటించిన సినిమా ‘ఓం చాఫ్టర్‌ 1- ఉదిరం ది బ్లడ్‌ ఉడ్‌’. ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్స్‌గా నటించగా, మమ్ముట్టీ మరో ప్రధాన పాత్రలో నటించారు. రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వంలో ధనుష్‌, అజ్మత్‌, శ్రద్ధాకపూర్‌ నిర్మించిన ఈ సినిమా నవంబరు 20న (OM Movie Release Date) విడుదల కానుంది. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్‌.

‘ఓం సినిమా ఆల్మోస్ట్‌ బైలింగ్వల్‌ సినిమా. ఎందుకంటే..ఈ సినిమాలో డైలాగ్స్‌ 30 శాతం తెలుగులోనే ఉంటాయి. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన స్టార్స్‌ అందరు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా ఆడియన్స్‌ను నచ్చుతుంది” అని ధనుష్‌ చెప్పారు.

”నా మలయాళ సినిమాలు తెలుగులో డబ్‌ అయినప్పడు, తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ఈ ఓం సినిమాను కూడా చూస్తారని ఆశిస్తున్నాను. నాకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు రాజ్‌కుమార్‌ పెరియస్వామి నాకు ఓం కథ చెప్పారు. ఈ సినిమా చేయాలంటే నాకు కొంత సమయం పడుతుంది. అప్పటివరకు మీరు వెయిట్‌ చేస్తారా? అంటే సరే..అన్నారు.
దీంతో ఈ సినిమాకు నో చెప్పలేకపోయాను” అని మమ్ముట్టీ చెప్పారు.

”నా మెడికల్‌ చదువులో పడి నా కెరీర్‌ ప్రారంభంలో ఏ తరహా సినిమాలైనా చేసేశాను. నా చదవుపూర్తయింది. ఇక కొత్త శ్రీలీలను చూస్తారు” అని శ్రీలీల భావోద్వేగంగా మాట్లాడారు.

”ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ నిత్యారెడ్డి పాత్రలో నటించడం వల్ల పోలీసులపై తనకు ఉన్న గౌరవం మరింత పెరిగిందని సాయిపల్లవి చెప్పారు. తన తాతగారు డీఎస్‌పీ అన్న విషయాన్ని గుర్తు చేశారు.

 

Please Share
Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah