RifleClub Telugu Review: మలయాళం ఫిల్మ్‌ రైఫిల్‌ క్లబ్‌ రివ్యూ

Viswa
3 Min Read
Rifile Club Telugu Review

Web Stories

కథ

RifleClub Telugu Review: షాజహాన్‌ రొమాంటిక్‌ హీరో. వేటమృగం అనే ఓ యాక్షన్‌ ఫిల్మ్‌ చేసి, యాక్షన్‌ హీరోగా కూడా రాణించాల నుకుంటాడు. ఇందుకోసం రైఫిల్‌క్లబ్‌లో సభ్యుడిగా జాయినై, తుఫాకులను ఎలా హ్యాండిల్‌ చేయాలో నేర్చు కోవాలనుకుంటాడు.

మరోవైపు ఆక్రమ ఆయుధాలను సరఫరా చేసే వ్యాపారి, క్లబ్‌ ఓనర్‌ దయానంద్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడి బర్త్‌ డే పార్టీలో డ్యాన్స్‌ చేయడానికి ఓ డ్యాన్స్‌ బృందం వస్తుంది. ఈ బృందంలోని ఓ అమ్మా యిని కిస్‌ చేయాలంటాడు దయానంద్‌ పెద్ద కుమారుడు. కానీ ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు, అతనికి మధ్య చిన్న గొడవ జరిగుతుంది. దయానంద్‌ పెద్ద కుమారుడు చనిపోతాడు. దీంతో బయపడిన లవర్స్‌ ఇద్దరు షాజ హాన్‌ సాయం కోరతారు. ఎందుకంటే…దయానంద్‌ పెద్ద కుమారుడిని చంపిన అబ్బాయి….. షాజహాన్‌కు కజిన్‌ అవుతాడు. షాజహాన్‌ రైఫిల్‌ క్లబ్‌లో ఉండటంతో,అక్కడికి వెళ్తారు లవర్స్‌ ( RifleClub Telugu Review)

RifleClub Telugu Review

అన్న చావుకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు దయానంద్‌ రెండో కుమారుడు. ఈ క్రమంలో రైఫిల్‌ క్లబ్‌లో చనిపోతాడు. కుమారులు ఇద్దరు చనిపోవడంతో, రైఫిల్‌ క్లబ్‌లోని అందర్నీ చంపే యాలని, దయానంద్‌ అనుకుంటాడు. మరి..దయానంద్‌ను రైఫిల్‌ క్లబ్‌ ఎలా ఎదుర్కోంది? రైఫిల్‌ క్లబ్‌ సెక్రటరీ అవరాన్‌కు, దయానంద్‌కు మధ్య ఏం జరిగింది? అన్నది సినిమాలో చూడాలి ( RifleClub Telugu Review)

Sankranthiki Vasthunam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ

విశ్లేషణ

సినిమా అంతా ఫుల్‌ యాక్షన్‌ మూవీ. బర్త్‌ డే పార్టీతో సినిమా ప్రారంభం అవుతుంది. దయానంద్‌ రెండో కుమారుడు రైఫిల్‌ క్లబ్‌ మెంబర్స్‌ చేతిలో చనిపోవడంతో కథ రసవత్తరంగా మారుతుంది. కథలో పెద్దగా డ్రామా ఏమీ ఉండదు. సినిమాకు యాక్షనే హైలైట్‌గా ఉంటుంది. తుఫాకులే డైలాగ్స్‌ చెబుతుంటాయి. ఈ తుఫాకుల సౌండే మ్యూజిక్‌ అన్నట్లు. మొదట్లో సినిమా కాస్త స్లోగా సాగుతుంది. సినిమాకు సెకండాఫ్‌ యే ముఖ్యం. అలాగే సెకండాఫ్‌లోనూ కొంత ల్యాగ్‌ సీన్స్‌ ఉన్నాయి. దయానంద్‌ బృందం చేతిలో మిషన్‌ గన్స్‌ ఉంటాయి. రైఫిల్‌ క్లబ్‌ టీమ్‌ మొత్తం దగ్గర 45 బుల్లెట్స్‌ ఉంటాయి. మరి..45 బుల్లెట్స్‌తో మిషన్‌గన్స్‌ ఉన్న దయానంద్‌ బృందాన్ని రైఫిల్‌ క్లబ్‌ సభ్యులు ఓ ఐక్యతగా ఎలా అడ్డుకున్నారు అనే పాయింట్‌ను ఆసక్తికరంగా చూపించారు దర్శకుడు ( RifleClub Review)

RifleClub Telugu Review

నటీనటులు- సాంకేతిక నిపుణులు

Sookshmadarshini ott: మలయాళ బ్లాక్‌బస్టర్‌ సూక్ష్మదర్శని రివ్యూ

నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న దయానంద్‌ పాత్రలో అనురాగ్‌కశ్యప్‌ అదరగొట్టాడు. అనురాగ్‌ను మరోసారి కొత్తగా చూస్తారు ఆడియన్స్‌. ఇక రైఫిల్‌ క్లబ్‌ సెక్రటరీ అవరాన్‌గా దిలీష్‌ పోతన్‌ యాక్టింగ్‌ బాగుంటుంది. సెకం డాఫ్‌లో అనురాగ్, దిలీప్‌ల మధ్య సంభాషణలు యాక్షన్‌ ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. యాక్టర్‌ షాజహాన్‌గా వినీత్‌కుమార్‌ ఉన్నంతలో బాగానే చేశాడు. వీరి తర్వాత ఇట్టియాన్‌గా చేసిన వాణీ విశ్వనాథ్‌ క్యారెక్టర్‌యే హైలైట్‌. వాణివిశ్వనాథన్‌ ఒకట్రెండు షూటింగ్‌ సీన్స్‌ ఆడియన్స్‌కు హై ఇస్తాయి. రైఫిల్‌ క్లబ్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు లోనప్పన్‌గా విజయరాఘవన్‌ యాక్టింగ్‌ మెప్పిస్తుంది. దర్శన్‌ రాజేంద్రన్, సురేష్‌కృష్ణ వారు వారి పాత్రల మేరకు చేశారు. ఆషిక్‌ అబు డైరెక్షన్‌ ఒకే. కొంత ల్యాగ్‌ సీన్స్‌ ఉన్నాయి. రైఫిల్‌క్లబ్‌ వాల్ట్‌ అంటూ హడావిడి చేసినా, ఈ వాల్ట్‌ సీన్‌ తర్వాత తేలిపోతుంది. సినిమా నిడివి తక్కువగా ఉండటం ఈ సినిమాకు మరో ఫ్లస్‌ పాయింట్‌. రెక్స్‌ విజయన్‌ ఆర్‌ఆర్‌ బాగుంది. వి. సాజన్‌ ఎడిటింగ్‌ ఒకే. వేటాడే సీన్స్, సెకండాఫ్‌లో కొన్నీ సీన్స్‌ తీసేయవచ్చు. ఆషికి అబు కెమెరా ఒకే.

బాటమ్‌ లైన్స్‌:  యాక్షన్‌ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్‌కు రైఫిల్‌ క్లబ్‌ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌. ఫస్టో కొంత ల్యాగ్‌ ఉంటుంది. డ్రగ్స్‌, ఆయుధాల విజువల్స్‌ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పెద్ద వాళ్లే ఈ సినిమా చూస్తే బెటర్‌.

రేటింగ్‌ 2.75/5

 

 

Please Share
4 Comments
Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos