AlluArjun And Ramcharan: మెగాఫ్యామిలీకి, అల్లుఅర్జున్‌కు మధ్య కొంతకాలంగా కోల్డ్‌వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో భాగంగా తన స్నేహితుడు, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి తరఫున ప్రాచారం అల్లు అర్జున్. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పీఠాపురంలో ‘కూటమి’ (జనసేన, బీజేపీ, టీడీపీ) తరఫున ప్రచారం నిర్వహించారు. పవన్‌కళ్యాణ్ తరఫున రామ్‌చరణ్ కూడా ప్రచారం చేశారు. కానీ ఆ సమయంలో అల్లు అర్జున్ వైఖరి నచ్చని, సాయిధరమ్‌తేజ్…అల్లు అర్జున్‌ను సోషల్‌మీడియాలో అన్‌ఫాలో చేశారు. అప్పట్నుంచి మెగాఫ్యామిలీకి, అల్లుఅర్జున్‌కు మధ్య కోల్డ్‌వార్ జరుగుతూనే ఉంది. ఈ నెక్ట్స్ అల్లు అర్జున్‌ను పరోక్షంగా విమర్శిస్తూ, నాగబాబు ‘ఎక్స్’వేదికగా షేర్ చేసిన కోట్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి. దీంతో మెగా వర్సెస్ అల్లు వివాదం తారాస్థాయికి చేరింది.
కానీ ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రీమియర్‌ను సంధ్యథియేటర్స్‌లో డిసెంబరు 4న ప్రదర్శించారు. కానీ అనుకోకుండ అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళా మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ హాస్పి టల్‌లో ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు. కానీ ఈ తొక్కిసలాటకు అల్లు అర్జున్ కారణం అంటూ పోలీసులు అల్లుఅర్జున్‌ను అరెస్ట్ చేశారు. కొంతకాలం తర్వాత బెయిల్‌పై వచ్చిన అల్లుఅర్జున్ …స్వయంగా వెళ్లి చిరంజీవిని కలిశాడు. దీంతో మెగా వర్సెస్ అల్లుఅర్జున్ కోల్డ్‌వార్ కంప్లీట్ అయిపోయిందని అను కున్నారు. కానీ ఈ ఇన్సిడెంట్‌పై చాలామంది తెలుగుహీరోలు సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు. కానీ రామ్‌చరణ్ రెస్పాండ్ కాలేదు. అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కూడా పరామర్శించలేదు. అప్పటికే వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలు ఉన్నట్లుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి.ఆ తర్వాత గేమ్‌చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను ఎంత ఎదుగుతున్న నా మూలాలను మర్చిపోనని పవన్‌కళ్యాణ్ మాట్లాడారు. అల్లు అర్జున్ ఉద్దేశించేనని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది.
కానీ సడన్‌గా సోషల్æమీడియాలో అల్లుఅర్జున్ ఇన్‌స్టాను అన్‌ఫాలో చేశారు రామ్‌చరణ్. దీంతో కొత్త వివాదం ((AlluArjun And Ramcharan).) తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా సక్సెస్, రామ్‌చరణ్ ‘గేమ్‌చేంజర్’ సినిమా డిజాస్టర్ అవ్వడం….ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో వార్ చేసుకోవడం జరిగింది.ఇక అల్లు శిరీష్‌ను మాత్రం రామ్‌చరణ్ అన్‌ఫాలో చేయలేదు. ఇటు రామ్‌చరణ్ భార్య ఉసాసన ప్రస్తుతానికి అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేయలేదు.
ఇదిలా కొనసాగుతుండగానే….నాగచైతన్య ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ ప్రవర్తన రామ్ చరణ్‌ను తగ్గించేలా కనిపించింది. దీంతో…మెగాఫ్యాన్స్ హార్ట్ అయ్యారు. ఇందుకు ఆ తర్వాత అల్లు అర వింద్ çపరోక్షంగా క్షమాపణలు చెప్పిన, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
ఇక ‘లైలా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న చిరంజీవి, ‘పుష్ప 2’ విజయాన్ని గురించి మాట్లాడారు. అయితే గతంలో ‘పుష్ప 2’ విజయాన్ని గురించి, సినిమా ఇండస్ట్రీ స్టార్స్ సోషల్‌మీడియాలో స్పందించి నప్పుడు…వారికి అల్లు అర్జున్ సోషల్ మీడియాలోనే థ్యాంక్స్ చెప్పాడు. కానీ.. పబ్లిక్‌మీట్‌లో ‘పుష్ప 2’ విజయాన్ని హర్షించిన చిరంజీవిపై మాత్రం అల్లు అర్జున్ ఇంతవరకు స్పందించలేదు. దీంతో అల్లు అర్జున్– మెగా ఫ్యామిలీల మధ్య కోల్డ్‌వార్ ఇంకా చల్లారలేదనే అనుకోవచ్చు. మరి…ఈ వివాదం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.