Brahmanandam Brahma Anandam Review: బ్రహ్మాఆనందం రివ్యూ

Viswa
4 Min Read
Brahmanandam Brahma Anandam Review

కథ

Brahmanandam Brahma Anandam Review: థియేటర్‌ ఆర్టిస్టు బ్రహ్మానందం (రాజాగౌతమ్‌) సినిమా యాక్టర్‌గా సక్సెస్‌ అవ్వాలనుకుంటాడు. ఈ దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు.  బ్రహ్మానందం, అతని స్నేహితుడు డాక్టర్‌ గురు (‘వెన్నెల’ కిశోర్‌) సాయంతో ఖర్చులకు ఇబ్బంది లేకుండా జీవనం సాగిస్తుంటాడు. తన ఆశలను, ఆశయాలను బాబాయ్‌ (ప్రభాకర్‌) కుమార్తె రాశి (దివిజ)తో షేర్‌ చేసుకుంటుంటాడు. సడన్‌గా ఓ రోజు…బ్రహ్మానందంను వృద్ధాశ్రమంలో ఉన్న ఆనంద మూర్తి మూర్తి కలవాలనుకుంటాడు. ఈ విషయాన్ని బ్రహ్మానందంకు చెప్పి అతన్ని ఆనందమూర్తి దగ్గరకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తుంది రాశీ. బ్రహ్మానందంకు ఇష్టం ఉండదు (Brahmanandam Brahma Anandam Review)

నాగచైతన్య-సాయిపల్లవిల ఎమోషనల్‌ లవ్‌స్టోరీ మూవీ తండేల్‌ రివ్యూ

ఈ లోపు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి థియేటర్‌ ఆర్టిస్టుల పోటీ గురించి బ్రహ్మానందంకు తెలుస్తుంది. ఈ పోటీలో పాల్గొనేందుకు బ్రహ్మానందంకు ఆరు లక్షల రూపాయాలు అవసరం అవుతాయి. ఈ డబ్బుకోసం బ్రహ్మానందం ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ ఫలితం ఉండదు. నిరాశలో ఉన్న బ్రహ్మానందంకు…తన పేరున ఉన్న ఆరు ఏకరాల భూమిని ఇస్తానని ఆనందమూర్తి ఆఫర్‌ ఇస్తాడు. కానీ ఇందుకు కొన్ని షరతలు విధిస్తాడు. ఇలా ఆనందమూర్తి ఊరికి బ్రహ్మానందం తప్పక వెళ్లాల్సి వస్తుంది. మరి..అక్కడ ఏం జరిగింది? తన పేరుపై ఉన్న ఆస్తిని అమ్మి బ్రహ్మా నందంకు ఆనందమూర్తి డబ్బులు సమకూర్చాడా? సినిమా యాక్టర్‌ కావాలన్న బ్రహ్మానందం ఆశయం నెరవేరిందా? బ్రహ్మానందంను ఇష్టపడే తార తీసుకున్న నిర్ణయం, అతని జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది? ఆనందమూర్తి జీవితంలో జ్యోతి(తాళ్లూరి రామేశ్వరి)కి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అన్న ఆసక్తికరమైన విషయాలను సిల్వర్‌స్క్రీన్‌పై చూడాలి.

విశ్లేషణ

నిజజీవితంలో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజాగౌతమ్‌లు…బ్రహ్మాఆనందం సిని మాలో తాత – మనవళ్లుగా నటిస్తారనే పాయింట్‌ ‘బ్రహ్మాఆనందం’ సినిమాపై ఆసక్తిని క్రియేట్‌ చేసింది. పైగా ఈ సినిమాను సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ (మళ్ళీరావా, మసూద, ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ) రాహుల్‌యాదవ్‌ నక్కా తీయడంతో ఈ సినిమాపై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. పైగా బ్రహ్మానందం చేసే రోటీన్‌ కామెడీ రోల్, ఈ సినిమాలో చేయడం లేదనేది ఈ సినిమాకు మరో ఫ్లస్‌ పాయింట్‌ అయ్యింది.

రాజాగౌతమ్, వెన్నెల కిశోర్‌ల మధ్య ఫ్రెండ్‌షిఫ్‌ బాండింగ్, రాజాగౌతమ్‌–దివిజ ప్రభాకర్‌ల మధ్య అన్నచెల్లెల అనుభంధం, ప్రియావడ్లమానితో లవ్‌ ట్రాక్‌తో తొలి నలభై నిమిషాలు సినిమా కాస్త నింపాదిగానే సాగుతుంది. కథలో ఎప్పుడైతే ఆనందమూర్తిగా బ్రహ్మానందం వస్తాడో, అక్కడ్నుంచి
కథ వేగం పెరుగుతుంది. థియేటర్‌ ఆర్టిస్టుల పోటీలో పాల్గొనేందుకు ఆనందమూర్తిగా బ్రహ్మానందం… రాజాగౌతమ్‌ను ఏట్రాక్ట్‌ చేసే సీన్స్, ఆ తర్వాత…రాజాగౌతమ్‌–వెన్నెలకిశోర్‌– బ్రహ్మానందం…ఓ పల్లెటూరికి చేరుకోవడం, అక్కడ ఓ చిన్న ట్విస్ట్‌తో ఇంట్రవెల్‌ కార్డు పడుతుంది.

తొలిభాగంలో కామెడీ ఎక్కువగా, ఎమోషన్‌ తక్కువగా చూపించాడు దర్శకుడు నిఖిల్‌. వెన్నెల కిషోర్‌ కామెడీ పంచ్‌లు అక్కడక్కడ నవ్విస్తాయి. కానీ సెకండాఫ్‌ మాత్రం ….ఎమోషన్‌ ఎక్కువ, కామెడీ తక్కువగా చేశాడు దర్శకుడు. ఈ క్రమంలో రాజాగౌతమ్‌– బ్రహ్మాఆనందం– వెన్నెల కిషోర్‌ల మధ్య సీన్స్‌ అలరిస్తాయి. సంపత్‌నంది క్యారెక్టర్‌ మరో యాడిషన్‌. ఆడియన్స్‌ అందరు ఊహించినట్లుగానే, ఓ సామాజిక సందేశంతో ఈ సినిమాను దర్శకుడు ముగిస్తాడు. ఈ క్రమంతో కాస్త తడబడ్డాడు దర్శకుడు. ముఖ్యంగా రాజాగౌతమ్‌ మారిపోయే సీన్‌కు ఎమోషనల్‌ కనెక్ట్‌విటీ అంత బలంగా అనిపించదు. కానీ వృద్ధాప్యంలో వయోవృద్దుల కష్టాలు, వారి ఎమోషన్స్‌ను చూపించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అలాగే ఎమోషన్స్‌ను, కామెడీని కొంత వరకు బ్యాలెన్స్‌ చేయగలిగాడు.

పెర్ఫార్మెన్సెస్‌

ఆనందమూర్తి పాత్రలో బ్రహ్మాఆనందం (Brahmanandam) బాగా యాక్ట్‌ చేశాడు. తన మార్క్‌ కామెడీ సీన్స్‌లోనే కాదు… ఎమోషన్స్‌లోనూ మాస్టరే అని నిరూపించు కున్నారు. యాక్టర్‌గా వెయ్యికిపైగా సినిమాల్లోని బ్రహ్మానందం నటనానుభవాన్ని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అయితే యాక్టర్‌గా రాజా గౌతమ్‌ (RajaGowtham)ను మెచ్చుకోవాలి. మెచ్యూర్డ్‌ యాక్టింగ్‌ చేశాడు. కామెడీ, ఎమోషన్, లవ్‌..ఇలా అన్ని అంశాల్లో బాగా పెర్ఫార్మెన్స్‌ చేశాడు. ఈ పెర్ఫార్మెన్స్‌ అతని కెరీర్‌కు మంచి ఫ్లస్‌ పాయింట్‌ అనే చెప్పొచ్చు. ఇక వెన్నెల కిషోర్‌ కామెడీ, ఆ టైమింగ్‌ ఎప్పట్లానే ఆడియన్స్‌ను అలరించేలా ఉన్నాయి. ఈ సినిమాకు ఓ మెయిన్‌ పిల్లర్‌లా ఉన్నాడు వెన్నెల కిశోర్‌. రాశిగా దివిజ ప్రభాకర్, తారగా ప్రియా వడ్లమాని, జ్యోతిగా రామే శ్వరి, రాజీవ్‌కనకాల, సంపత్‌నంది, ఐశ్వర్య హోలక్కల్‌ వారి వారి పాత్రలు, పరిధిమేరకు మెప్పించారు.

మితేస్‌ పర్వతనేని విజువల్స్‌ బాగున్నాయి. శాండిల్య పిసపాటి మ్యూజిక్, ముఖ్యంగా ఆర్‌ఆర్‌ ఈ సినిమాకు ప్రధానబలంగా నిలిచాయి. రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మాణవిలువలు ఒకే. ఎడిటర్‌ ప్రణీత్‌ ఇంకాస్త ఎడిట్‌ చేసి, నిడివి తగ్గించే స్కోప్‌ సినిమాలో ఉంది.

బాటమ్‌లైన్స్‌: అరకొర ఆనందమే అయినా….ఫ్యామిలీతో ఆనందంగా చూడొచ్చు. 

రేటింగ్‌: 2.5/5

 

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *