popularheroine Rashmika Mandanna: దర్శకుడు సుకుమార్ మేకింగ్, టేకింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఎప్పుడూ కొత్తదనం కోసం ట్రై చేస్తుంటారు. పర్ఫెక్షనిజమ్ కోసం ప్రాణం పెడతారు. అయితే సుకుమార్ సినిమాల్లో ఉన్న ఓ యూనిక్ క్వాలిటీ ఏంటంటే….ఒకసారి తన సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేసిన అమ్మాయిని, మళ్లీ తన సినిమాల్లోకి తీసుకోరు. సుకుమార్ ఇప్పటికీ ఇదే ఫాలోఅవుతున్నారు.
కానీ ఫస్ట్‌టైమ్ ఈ రూల్‌ను బ్రేక్ చేయాలనుకుంటున్నారట సుకుమార్. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత దర్శకుడు సుకుమార్, హీరో రామ్‌చరణ్ కలిసి మళ్లీ మరో సినిమా చేయనున్నారు. చరణ్ కెరీర్‌లో ఇది 17వ సినిమా. అయితే ఈ మూవీలోని హీరోయిన్ పాత్రకు రష్మికను తీసుకోవాలని ప్రాథమిక పరిశీలన చేస్తున్నారట సుకుమార్. ‘పుష్ప’ సినిమా కోసం రష్మిక (Rashmika Mandanna)తో ఐదేళ్లు ప్రయాణం చేశారు సుకుమార్. ఇలా రష్మిక యాక్టింగ్‌లోని బలాలు, బలహీనతలు సుకుమార్‌కు బాగా తెలిసే ఉంటాయి. ఇలా రష్మికను తీసుకుంటే ఇలా కూడా ఓ ఫ్లస్ ఉందని సుకుమార్ ఆలోచిస్తున్నారట.
అయితే ప్రస్తుతం బుచ్చిబాబుతో రామ్‌చరణ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూరై్త, రిలీజ్ కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఈ లోపు రామ్‌చరణ్‌తో తాను తీయబోయే కథను రెడీ చేసుకుంటారు సుకుమార్. ఆ తర్వాత నటీనటుల ఎంపిక ఉంటుంది. మరి…సుకుమార్ తన రూల్‌ను రష్మిక కోసం బ్రేక్ చేస్తారా? లేదా అనేది చూడాలి.
ప్రజెంట్ రష్మికా మందన్నా ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. రష్మికా మందన్నా హీరోయిన్‌గా యాక్ట్ చేసిన గత మూడుచిత్రాలైన ‘యానిమల్, పుష్ప ది రూల్, చావా’లు హిందీ బాక్సాఫీస్ వద్ద హిట్స్‌గా నిలిచాయి. ఈ స్పీడ్‌లోనే రష్మికా మందన్నా ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌తో ‘సికందర్’, ఆయుష్మాన్‌ఖురానాతో ‘థామా’ చిత్రాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలూ, ఈ ఏడాదే హిందీలో రిలీజ్ కానున్నాయి. ఇలా హిందీలో రష్మికా మందన్నాకు సూపర్‌డూపర్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఒకవేళ రష్మికను తీసుకుంటే రామ్‌చరణ్, సుకుమార్‌లకు ఇలా ఫ్లస్సే అవుతుంది. మరి..సుకుమార్ ఫైనల్‌గా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.