హీరోయిన్ తమన్నాకు బ్రేకప్ (Tamannaah Bhatia love breakup) అయ్యారు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (VijayVarma), తమన్నాలు రెండు సంవత్స రాలుగా డేటింగ్‌లో ఉన్నారు. వీరిద్దరు తొలిసారిగా ‘లస్ట్‌స్టోరీస్’ అనే వెబ్ అంథాలజీ చిత్రీకరణలో కలుసుకున్నారు. ఆ సమయంలో విజయ్ వర్మయే తమన్నాకు ప్రపోజ్ చేశారట. మొదట్లో కాస్త ప్రైవసీగానే జరిగిన వీరి ప్రేమాయణం, ఆ తర్వాత బయటికొచ్చింది. దీంతో చేసేదేమి లేక విజయ్ వర్మయే తమన్నాతో తన లవ్‌ను కన్ఫార్మ్ చేశారు. ఆ తర్వాత తమన్నా కూడా పరోక్షంగా కన్ఫార్మ్ చేసినట్లుగా ఒకట్రెండు సందర్భాల్లో మాట్లాడారు. ఈ ఏడాదిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబుతున్నారు? అనే టాక్ కూడా తెరపైకి వచ్చింది.
కానీ సడన్‌గా….తమన్నా, విజయ్‌వర్మలు… ఒకరికొకరు తమ ఇన్ స్టా అకౌంట్స్‌లో వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేశారు. దీంతో విజయ్ వర్మ–తమన్నాలు విడిపోయారనే టాక్ ఇండస్ట్రీలో గుప్పుమంది. ఫైనల్‌గా ఈ వార్తయే నిజమైంది. తమన్నా–విజయ్ వర్మలు బ్రేకప్ చేప్పుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. తమన్నా ప్రస్తుతం తెలుగులో ‘ఓదెల 2 (Odhela2)’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో నాగసాధువు, శివశక్తిగా తమన్నా కనిపిస్తారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.