కథ
Manikandan K. Kudumbasthan Movie Review: నవీన్ (మణికందన్), వెన్నెల (శాన్వీ మేఘన)లు కులాంతర ప్రేమవివాహం. మొదట్లో వద్దనుకున్నా…ఆ తర్వాత నవీన్ పెళ్లిని, అతని కుటుంబసభ్యులు ఒప్పుకుంటారు. కలెక్టర్ కావాలన్నది వెన్నెల కల. ఇందు కోసం ఇంట్లో చదువుకుంటుంటుంది. నవీన్ తల్లిదండ్రులకు సంపాదన లేదు. దీంతో..కుటుంబభారం అంతా నవీన్‌పైనే పడుతుంది. పైగా వెన్నెల గర్భవతి అవుతుంది. ఇల్లు బాగు చేయమని తండ్రి, తనను తీర్థయార్థలకు పంపమని తల్లి, చదువుకోవడానికి కంప్యూటర్ – ఇంటర్‌నెట్ కనెక్షన్ కావాలని వెన్నెలనవీన్‌పై ఒత్తిడి తీసుకువస్తారు. తల్లి, తండ్రి, బావ…ఇలా అందరికీ డబ్బులు ఇస్తానని నవీన్ ఒప్పు కుంటాడు. కానీ సడన్‌గా నవీన్ ఉద్యోగం పోతుంది. తనకు ఉద్యోగం పోయిన విషయాన్ని ఇంట్లోచెప్పడానికి నవీన్ భయపడతాడు. మరోవైపు అక్కయ్య అనిత విడాకులు తీసుకోవాలనుకుంటుంది.బావ రాజేంద్రన్‌తో కూడా నవీన్‌కు కొన్ని సమస్యలు ఉంంటాయి. మరి..ఆ తర్వాత నవీన్ లైఫ్‌లో ఏం చేశాడు. కుటుంబపోషణ కోసం నవీన్ తీసుకున్న నిర్ణయాలు, అతడిని, అతని కుటుంబాన్ని ఏ విధంగాఇబ్బంది పెట్టాయి? అన్నది సినిమాలో చూడాలి (Manikandan K. Kudumbasthan Movie Review)
విశ్లేషణ
కుటుంబభారంతో పోరాడుతున్న ఓ మధ్యతరగతి యువకుడి జీవిత ప్రయాణమే ఈ సినిమా. మధ్యతరగతి కుటుంబాల్లోని అన్ని విషయాలను ఈ సినిమాలో దర్శకుడు ప్రస్తావించాడు. జీవితంలో మరో ముందడుగుపడుతుందనుకున్న సమయంలోనే నవీన్‌కు ఉద్యోగం పోవడం, అప్పటి కప్పుడు ఖర్చు మీద ఖర్చు వచ్చి పడటం, డబ్బుల కోసం నవీన్ వడ్డీవ్యాపారుల దగ్గర అప్పు చేయడం, ఆన్‌లైన్ లోన్ తీసుకోవడం…వంటి సన్నివేశాలు ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతాయి. ఈ సీన్స్‌కు వినోదాత్మకంగా ఉండటం ఈ సినిమాకు ఫ్లస్ పాయింట్. కానీ సెకండాఫ్‌లో కథ అక్కడిక్కడే తిరుగుతుండటం కాస్త మైనస్. పైగా నవీన్ వ్యాపారాలుప్రారంభించడం, అవి ఫెయిల్ కావడం వంటి రోటీన్ సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్ ఆలోచనావిధంగా, వినోదాత్మకంగా ఉంటాయి. క్లైమాక్స్ రోటీన్‌గా ముగుస్తుంది.
అయితే ఆత్మగౌరవం పాయింట్‌ను డీల్ చేసిన దర్శకుడు, దాన్ని క్లైమాక్స్‌లో వదిలేసినట్లుగా అనిపిస్తుంది. నవీన్ కూడా తన కలను సాకారం చేసుకోకుండ, మళ్లీ జాబ్‌లో జాయిన్ కావడం అనేది రోటీన్‌గా ఉంటా యి. కలెక్టర్ కావాలన్నుకున్న వెన్నెల క్యారెక్టర్ ఇన్‌కంప్లీట్‌గా ఉంటుంది. మధ్య తరగతి జీవుల జీవితాలుమారవు అన్నట్లుగా దర్శకుడు చూపించే ప్రయత్నం చేయడం బాగోలేదు.
పెర్ఫార్మెన్స్
నవీన్‌గా మణికందన్ బాగా యాక్ట్ చేశాడు. కామెడీ టైమింగ్ కుదిరింది. ఎమోషనల్ సీన్స్‌లో ఇంకాస్త పరిణితితో కూడిన యాక్టింగ్ చేయాల్సింది. వెన్నెల క్యారెక్టర్‌లో శాన్వీ మేఘన అదరగొట్టారు. ఎమోషనల్ సీన్స్‌లో బాగా యాక్ట్ చేశారు. ఈ పాత్రకు కామెడీ అంతగా లేదు. హీరో బావ రాజేంద్రన్ పాత్రలో గురు సోమసుందరంగా రోల్ హైలైట్‌గా ఉంటుంది. ముఖ్యంగా నవీన్–రాజేంద్రన్‌ల మధ్య సీన్స్ బాగుంటాయి. హీరో తండ్రిగా ఆర్. సుందరరాజన్, తండ్రిగా కనకం, హీరో అక్కగా నివేదిత రాజప్పన్ వంటవాళ్లు…వారి వారి పాత్రల మేరకు యాక్ట్ చేశారు. హీరో ఫ్రెండ్ పాత్రలో అనిరుత్ కామెడీ ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ,సాంకేతిక విలువలు బాగున్నాయి. వైసాఘ్ మ్యూజిక్ బాగుంది.
ఫైనల్‌గా…కుటుంబపెద్ద అలరిస్తాడు
రేటింగ్ 2.5/5
జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.