ఇటు మాస్‌కి బాస్‌..అటు ఫ్యామిలీమేన్‌

Viswa
1 Min Read

Web Stories

ManaShankaraVaraPrasad Garu: చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మనశంకరవరప్రసాదుగారు’ (Mana Shankara Vara Prasad Garu). ఈ సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను జనవరి 12న (Mana Shankara Vara Prasad Garu Release date) థియేటర్స్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. జనవరి 11న ప్రీమి యర్స్‌ను ప్లాన్‌ చేశారు. నయనతార (Nayanathara) ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించగా, వెంకటేశ్ (Venkatesh), క్యాథరీన్, వీటీవీ గణేష్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో శంకరవరప్రసాదు పాత్రలో చిరంజీవి, శశిరేక పాత్రలో నయనతార నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

రా ఏజెంట్, నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌గా ఉన్న శంకరవరప్రసాదు ఉద్యోగం మానేసి, ఇంట్లో పనులు చేస్తుండటం, ఆ తర్వాత ఓ పెద్ద మిషన్‌ కోసం మళ్లీ డ్యూటీలో జాయిన్‌ కావడం వంటి సన్నివేశాలు ట్రైలర్‌ లో కనిపిస్తున్నాయి. ప్రసాదుతో శశిరేక వివాహం, ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వంటి సీన్స్‌ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ట్రైలర్‌ చివర్లో వెంకటేశ్‌ ఎంట్రీ, ‘‘చూడ్డానికి ఫ్యామిలీమేన్‌లా ఉన్నా వ్‌? ఏంటి..మాస్‌ ఏంట్రీలు ఇస్తున్నావ్‌’ అని వెంకటేశ్‌ ఎంట్రీని ఉద్దేశించి, చిరంజీవి అడగ్గా…ఇందుకు వెంకటేశ్‌ స్పందిస్తూ…‘‘చూడ్డానికి మాస్‌కి బాస్‌లా ఉన్నావ్‌…నువ్వు ఫ్యామిలీ సైడ్‌ రాలేదా’ అంటౌ కౌంటర్‌ డైలాగ్‌ ఇవ్వడం వంటి సీన్స్‌ ఉన్నాయి. అలాగే ఈ సినిమాలోని ఓ మేజర్‌ యాక్షన్‌ బ్లాక్‌ సీక్వెన్స్‌ను ట్రైలర్‌లో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ట్రైలర్‌లో కథను పెద్దగా రివీల్‌ చేయకుండానే, కమర్షియల్‌ వేలో కట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. సుష్మితా కొణిదెల, సాహు గారపాటి నిర్మించిన ఈ సిని మాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించాడు.

Please Share
Share This Article
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu