Ntr And VijayDeavrakonda: ఎన్టీఆర్ (, విజయ్‌దేవకొండ….ఈ ఇద్దరు శ్రీలంకకు వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్‌తో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీ చేస్తున్నాడు. ఫిబ్రవరి 20న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. కానీ ఎన్టీఆర్ షూట్‌కు రాలేదు. అంటే ఎన్టీఆర్ ఇన్‌వాల్వ్ కావాల్సిన సీన్స్ ఈ షూటింగ్ షెడ్యూల్‌లో లేవు. ధర్నా చేయడం, రాస్తారోకో…వంటి సీన్ ఒకటి తీశారు. కానీ నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్ మాత్రం ఎన్టీఆర్ పాల్గొం టారట. కాగా..ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్ శ్రీలంకలో జరగనుందని తెలిసింది. ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ భువన గౌడ ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబోలోనే ఉన్నారు. షూటింగ్ కోసం అక్కడ లొకేషన్ హంట్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు. ముంబైలో హృతిక్‌రోషన్ కాంబినేషన్‌తో ఓ సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ సాంగ్‌తో ‘వార్ 2’ షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఆ నెక్ట్స్ డ్రాగన్ మూవీ షూటింగ్‌లోనే జాయిన్ అవుతారు ఎన్టీఆర్.
విజయ్‌దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్‌డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లోని ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. శ్రీలంకలో ఓ భారీ షెడ్యూల్ కూడా జరిపారు. అయితే కొంచెం ప్యాచ్‌వర్క్ నిమిత్తం విజయ్ దేవరకొండ శ్రీలంకకు వెళ్లాల్సి ఉంది. అక్కడ నాలుగైదు సీన్స్, నాలుగైదు క్లోజప్ షాట్స్‌ను పూర్తి చేసి, గోవాకు వెళ్లారు. అక్కడ కూడా కొంత ప్యాచ్ వర్క్ చేస్తే ‘కింగ్‌డమ్’ షూటింగ్ పూర్తవుతంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న కింగ్‌డమ్ మూవీ…మే 30 రిలీజ్‌కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.